విజయ్ పక్కన మరో నటి.. రష్మిక ప్లానా ఇది?
టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ – కృతి సనన్ జోడీ కోసం జోరుగా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 2 May 2026 11:04 AM ISTటాలీవుడ్ లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ – కృతి సనన్ జోడీ కోసం జోరుగా చర్చ సాగుతోంది. హాయ్ నాన్న ఫేమ్ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో వారిద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ కాంబినేషన్ నిజంగానే ఫైనల్ అయ్యిందా? లేక కేవలం రూమర్ స్టేజ్ లోనే ఉందా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే విజయ్ దేవరకొండ కెరీర్ స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. వరుసగా పెద్ద ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రణబలి, రౌడీ జనార్ధన్ వంటి సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉండగా, శౌర్యువ్ తో చేస్తున్న సినిమా ఆయన కెరీర్ లో కీలకంగా మారే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతుండటం ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో హీరోయిన్ ఎంపికపై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉన్న ఫేస్ కావాలనే ఉద్దేశంతో బాలీవుడ్ నుంచి కృతి సనన్ పేరును పరిశీలించినట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో 1: నేనొక్కడినే, దోచేయ్ సినిమాల్లో నటించిన కృతి, తర్వాత హిందీలో స్టార్ హీరోయి న్‌గా ఎదిగింది. ఆదిపురుష్ తో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ నేపథ్యంలో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు ఆసక్తి పెంచుతున్నాయి. అయితే అసలు ప్రశ్న మాత్రం అదే.. విజయ్ పక్కన కృతి సెట్ అవుతుందా? సోషల్ మీడియాలో ఆ విషయంపై మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కొందరు ఆ జోడీ ఫ్రెష్ గా ఉంటుందని, ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి మంచి కెమిస్ట్రీ ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు, విజయ్ కు ఉన్న రౌడీ ఇమేజ్ కు కృతి స్టైల్ మ్యాచ్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు.
మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆ కాంబినేషన్ వెనుక రష్మిక మందన్న పాత్ర ఉందన్న టాక్. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ మైసాలో కలిసి నటిస్తున్న కృతి, రష్మిక మధ్య ఏర్పడిన స్నేహం కారణంగా సజెషన్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇక సినిమాకు టెక్నికల్ టీమ్ మాత్రం భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్, వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ ఎరిక్ డర్ట్స్ లాంటి టెక్నీషియన్లు చిత్రంలో భాగమవుతున్నారు.
అలాగే హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపడుతున్నారు. ఆ రేంజ్ టీమ్ ఉండటంతో సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కించాలనే మేకర్స్ ప్లాన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఏదేమైనా.. విజయ్- కృతి కాంబినేషన్ నిజమైతే అది కచ్చితంగా కొత్తగా ఉండనుంది. కానీ ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ కాంబినేషన్ పై క్లారిటీ రాదనే చెప్పాలి. అయితే ఆ రూమర్ సినిమా మీద హైప్ పెంచిందనేది మాత్రం నిజం.
