Begin typing your search above and press return to search.

అమెరికాలో కింగ్‌డమ్ హవా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో రౌడీ ర్యాంపేజ్!

స్టేట్ వైజ్‌గా చూస్తే, అమెరికాలో టెక్సాస్ లో అత్యధికంగా $16,972.65 గ్రాస్ రావడం విశేషం. ఇక వర్జీనియాలో $3549.09, నార్త్ కరోలినాలో $3342.38, న్యూజెర్సీ లో $2815.55 కలెక్షన్స్ వచ్చాయి.

By:  Tupaki Desk   |   18 July 2025 3:30 PM IST
అమెరికాలో కింగ్‌డమ్ హవా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో రౌడీ ర్యాంపేజ్!
X

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ కింగ్‌డమ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ట్రైలర్, పాటల ద్వారా మంచి హైప్‌ను సృష్టించింది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతున్న ఈ చిత్రం రెండు భాగాల్లో వస్తుండగా, మొదటి పార్ట్ పై ఆడియన్స్‌లో ఆసక్తి ఎక్కువగా ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్ హిట్ గా నిలవాలన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో అమెరికాలోని ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర ట్రెండ్‌ను చూపిస్తున్నాయి. తాజాగా విడుదలైన లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు 98 థియేటర్లలో 197 షోలు ప్లాన్ చేయగా, మొత్తం 1660 టిక్కెట్లు అడ్వాన్స్‌లో అమ్ముడయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ $31,034గా ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభంకాకముందే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం విశేషం.

స్టేట్ వైజ్‌గా చూస్తే, అమెరికాలో టెక్సాస్ లో అత్యధికంగా $16,972.65 గ్రాస్ రావడం విశేషం. ఇక వర్జీనియాలో $3549.09, నార్త్ కరోలినాలో $3342.38, న్యూజెర్సీ లో $2815.55 కలెక్షన్స్ వచ్చాయి. న్యూయార్క్ కాలిఫోర్నియా వంటి ఇతర స్టేట్లలోనూ మంచి రిస్పాన్స్ నమోదైంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రీమియర్ నైట్‌కే ఈ చిత్రం లక్ష డాలర్ల మార్కును దాటే అవకాశముంది.

ఫస్ట్ డే ఫస్ట్ షోకి అమెరికాలోనే కాదు, దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘లైగర్’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాల తర్వాత కింగ్‌డమ్‌ ద్వారా మళ్లీ ట్రాక్‌లోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి తన మార్క్ మేకింగ్‌తో ఈ సినిమాను విజయం బాట పట్టిస్తారని ఇండస్ట్రీలో మంచి నమ్మకం ఉంది. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలకు కూడా హైలెట్ చేస్తుందట.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చేసిన ట్వీట్ ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆయన “విజయ్ మాస్టర్ క్లాస్, గౌతమ్ ఎపిక్” అంటూ చేసిన ట్వీట్ సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూపించింది. ఈ పాజిటివ్ బజ్‌తో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చినా ఇప్పుడిప్పుడే హైప్ పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలతో సినిమా మరో లెవెల్ హైప్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ తో ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.