ట్రైలర్ టాక్: కింగ్ డమ్ ఎమోషనల్ యాక్షన్ రైడ్
తాజాగా విడుదలైన కింగ్ డమ్ ట్రైలర్ ఆద్యంతం మెరుపులే మెరుపులు. ముఖ్యంగా విజయ్ దేవరకొండను యాక్షన్ హీరోగా మరో స్థాయిలో ఎలివేట్ చేసే చిత్రమిదని అర్థమవుతోంది.
By: Tupaki Desk | 26 July 2025 11:08 PM ISTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన యాక్షన్ డ్రామా 'కింగ్‌డమ్' ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు విడుదలైన ఇంటెన్స్ టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ తో మరో లెవల్ ఏంటో చూపించాడు దేవరకొండ.ఈ శనివారం సాయంత్రం తిరుపతిలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ అయింది. ఈవెంట్ లో చిత్రబృందం సందడి చేసింది.
తాజాగా విడుదలైన కింగ్ డమ్ ట్రైలర్ ఆద్యంతం మెరుపులే మెరుపులు. ముఖ్యంగా విజయ్ దేవరకొండను యాక్షన్ హీరోగా మరో స్థాయిలో ఎలివేట్ చేసే చిత్రమిదని అర్థమవుతోంది. ''ఇప్పుడు వాడేమో రాక్షసులందరికీ రాజై కూచున్నాడు!'' అనే ఒకే ఒక్క డైలాగ్ తో ఈ సినిమాలో అతడి పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ రప్పించే డైలాగులు ఎన్నో ఉన్నాయి. ట్రైలర్ లో డైలాగులతోనే సినిమా సారం ఏమిటో అర్థమైపోయింది.
ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పై గా మారాలి! నీ ఇల్లు కుటుంబం ఉద్యోగం అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగుపెట్టబోయే ప్రపంచం.. నువ్వు కలవబోయే మనుషులు.. నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు.. చాలా రిస్కీ ఆపరేషన్ సూరీ..! అంటూ దేవరకొండను ప్రిపేర్ చేసే పై ఆఫీసర్... ఇదంతా కింగ్ డమ్ టోన్ ని ఎలివేట్ చేసింది. నువ్వు స్పైగా వెళ్లబోయే గ్యాంగ్ కి లీడర్ అతడు! అంటూ ఫ్లాష్ బ్యాక్ ని కూడా ట్రైలర్ లో రివీల్ చేసారు. కింగ్ డమ్ అన్నదమ్ముల కథతో రూపొందిందని హింట్ ఇచ్చేశారు. తన అన్న కోసం వెతుకుతూ వెళ్లే తమ్ముడి కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో దేవరకొండ(సూరి)కు అన్న పాత్రలో సత్యదేవ్ పాత్ర చాలా క్యూరియస్ గా కనిపిస్తోంది.
ఆడికోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సారూ..! ఇయాళ చావో బతుకో తేల్చేది ఈ ఐదు నిమిషాలే... అంటూ దేవరకొండ ఎమోషనల్ గా చెబుతున్న డైలాగ్ ని బట్టి ఈ సినిమాలో యాక్షన్ పీక్స్ లో ఉండబోతోందని అర్థమవుతోంది. ఇక అండర్ కవర్ ఆపరేషన్ కోసం పోలీసాఫీసర్ ఉద్యోగం కూడా వదిలేసేవాడిగా దేవరకొండ కనిపిస్తాడు. ఇక ఇందులో భాగ్య శ్రీతో ఎమోషనల్ లవ్ స్టోరి అదనపు బోనస్ అని ట్రైలర్ చెబుతోంది. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా అటవిక మనుషుల పరిచయం, ఒక ప్రత్యేక ప్రపంచంలో వార్ ఏమిటన్నది తెరపైనే చూడాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ జెట్ స్పీడ్ తో వెబ్ లో దూసుకుపోతోంది. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం కాగా సినిమాటోగ్రఫీ మరో అస్సెట్ అని విజువల్స్ చెబుతున్నాయి. నిర్మాణ విలువల పరంగా నాగవంశీ రాజీకి రాలేదని కూడా అర్థమవుతోంది. ఈనెల 31న విడుదలవుతున్న ఈ సినిమా దేవరకొండ కెరీర్ బెస్ట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
