రౌడీ మళ్లీ మ్యాజిక్ చేసేలా ఉన్నాడే!
`అర్జున్‌రెడ్డి` మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి స్టార్‌లా దూసుకొచ్చిన సంచలనం విజయ్ దేవరకొండ.
By: Tupaki Desk | 2 May 2025 5:00 PM IST`అర్జున్‌రెడ్డి` మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి స్టార్‌లా దూసుకొచ్చిన సంచలనం విజయ్ దేవరకొండ. ఈ మూవీతో దేశ వ్యాప్తంగా విజయ్‌కి దక్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లోనూ భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న విజయ్ `లైగర్`తో పాన్ ఇండియా ట్రై చేసి అట్టర్ ఫ్లాప్‌ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చాడు. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ని నమ్మి మూడేళ్లు శ్రమించి చేసిన `లైగర్` డిజాస్టర్ అనిపించుకోవడంతో విజయ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
అప్పటి నుంచి తన పంథాకు భిన్నంగా సైలెంట్ అయిపోయాడు. కొత్త ప్రాజెక్ట్‌లతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో సైలెంట్‌గా కొత్త సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ `కింగ్‌డమ్`. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. టీజర్‌తో అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ ఈ నెల 30న పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవాలని విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో `కింగ్‌డమ్` ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టీజర్ కూడా ఆసక్తిని రేకెత్తించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే విజయ్‌కి జోడీగా నటిస్తోంది. `మిస్టర్ బచ్చన్`కు సెటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన భాగ్యశ్రీ బోర్సే కింగ్‌డమ్‌ని తన గ్లామర్‌తో హీటెక్కించేస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. `హృదయం లోపల` అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే లిప్ లాక్ లాగించేసి మళ్లీ `అర్జున్‌రెడ్డి` డేస్‌ని గుర్తు చేశారు. దీంతో నెట్టింట చర్చ మొదలైంది. `కింగ్‌డమ్`తో రౌడీ స్టార్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తున్నాడని, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవడం ఖాయమనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. తనదైన మార్కు రొమాన్స్‌తో విజయ్‌దేవరకొండ మరో సారి మ్యాజిక్ చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.
