Begin typing your search above and press return to search.

రౌడీ కింగ్‌డ‌మ్‌పై ఆ వార్త‌ల్లో నిజ‌మెంత‌!

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 April 2025 12:37 PM IST
Vijay Deverakonda’s Kingdom Faces Release Delay Buzz
X

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఓ ప‌క్క ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే వ‌రుస‌గా సినిమాల‌ని లైన్‌లో పెట్టేస్తూ చ‌క‌చ‌క పూర్తి చేస్తున్నాడు. `ఖుషి` త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా `కింగ్‌డ‌మ్‌`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ మేకోవ‌ర్‌, అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్ స‌రికొత్త‌గా ఉండ‌టం, `జెర్సీ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈ సినిమా చేస్తుండ‌టం, విజ‌య్‌తో క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తుడ‌టంతో ఈ ప్రాజెక్ట్ హిట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం, కేర‌ళ‌, శ్రీ‌లంక త‌దిత‌ర ప్ర‌దేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి.

మే 30న పాన్ ఇండియా మూవీగా వైర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్‌పై ఓ వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతూ రౌడీ ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ముందుగా ప్ర‌క‌టించిన డేట్‌న ఈ మూవీ రిలీజ్ అయ్యే అవ‌కాశం లేద‌ని, ఆ డేట్ మారే అవ‌కాశం ఉంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో చాలా కాలంగా రౌడీ సినిమా కోసం ఎదురు చూస్తున్న రౌడీ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతున్నార‌ట‌. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే నిర్మాత సూర్య‌దేవ‌ర న‌గావంశీ క్లారిటీ ఇవ్వాల్సిందే.

ఇదిలా ఉంటే విజ‌య్ దేవ‌ర‌కొండ `కింగ్‌డ‌మ్‌`తో పాటు మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్నాడు. ఇందులో `టాక్సీవాలా`, `శ్యామ్ సింగ‌రాయ్‌` చిత్రాల ఫేమ్ రాహుల్ సంకీత్య‌న్ డైరెక్ష‌న్‌లో ఓ పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా చేస్తున్నాడు. దీనితో పాటు ర‌వికాంత్ పేరేపు డైరెక్ష‌న్‌లోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ని `రౌడీ జ‌నార్ధ‌న్‌` పేరుతో రూపొందించ‌నుండ‌గా, దిల్‌రాజు నిర్మించ‌బోతున్నారు.