రౌడీ 'కింగ్‌డమ్' లో ఏం జరుగుతోంది? ఎందుకీ కన్ఫ్యూజన్?
ఇంతకు ముందు 'కింగ్‌డమ్'ని జూలై 4న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అంతకు ముందు మే 30న రిలీజ్ కావాల్సింది.
By: Tupaki Desk | 20 Jun 2025 1:23 PM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ 'కింగ్‌డమ్'. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్నా ఇంత వరకు ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాకపోవడం రౌడీ ఫ్యాన్స్‌ని కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే చాలా సార్లు ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదాపడుతూ వస్తోంది. జూలై 25న రిలీజ్ అవుతోందని మాత్రం కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే మేకర్స్ మాత్రం జూలై 25న కానీ లేదా ఆగస్టు 1న కానీ ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకు ముందు 'కింగ్‌డమ్'ని జూలై 4న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అంతకు ముందు మే 30న రిలీజ్ కావాల్సింది. అయితే టీమ్ ఈ డెడ్ లైన్‌లని సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాని ఆ టైమ్‌కు రెడీ చేయలేకపోయారు. దీంతో 'కింగ్‌డమ్' రిలీజ్ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తోంది. ఇదే సమయంలో పవన్ నటించిన పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు`..`కింగ్‌డమ్` టీమ్‌ని మరింతగా కన్ఫ్యూజ్ చేస్తోంది. గత కొంత కాలంగా రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్న టీమ్ ఈ మూవీని జూలై 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇదే ఇప్పుడు 'కింగ్‌డమ్'ని ఇరుకున పెట్టేస్తోంది. 'హరి హర వీరమల్లు' రిలీజ్ జూలైలో ఖచ్చితంగా ఉంటే రేస్ నుంచి 'కింగ్‌డమ్'ని తప్పించి మరో డేట్‌ని ఫైనల్ చేసుకోవాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నాడట. కానీ హరి హర వీరమల్లు టీమ్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్‌కు గురి చేస్తూ తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. జూలై 25న `కింగ్‌డమ్`ని రిలీజ్ చేయకపోతే ఆ తరువాత రేసులోకి `తమ్ముడు` వచ్చేస్తోంది. దాని తరువాత వద్దాములే అనుకుంటే వార్ 2, కూలీ సినిమాలు వచ్చేస్తున్నాయి.
వాటికి ముందు రిలీజ్ చేయాలనుకుంటే 'కింగ్‌డమ్`కు కేవలం రెండు వారాలు మాత్రమే కలెక్షన్‌లు రాబట్టుకునే టైమ్ ఉంటుంది. ఇప్పటికే వరుస వాయిదాల కారణంగా `కింగ్‌డమ్`పై నెగెటివ్ టాక్ వైరల్ అవుతోంది. దీనికి తోడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒత్తిడి కూడా తోడవ్వడంతో సినిమా ప్రమోషన్స్‌కు అనుకున్న టైమ్ కూడా దక్కేలా కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు.
రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో `కింగ్‌డమ్` ప్రమోషన్స్‌కు అసలు టైమ్ ఉంటుందా? అని ట్రేడ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. `హరి హర వీరమల్లు` కన్ఫ్యూజన్‌లో `కింగ్‌డమ్` రిలీజ్ డేట్‌ని ఫైనల్ చేయలేకపోతున్న నిర్మాత ఇప్పటికైనా సరైన రిలీజ్ డేట్‌ని ఫైనల్ చేయాలని, లేకుండా సినిమాపై ఉన్న బజ్ పూర్తిగా పోయే ప్రమాదం ఉందని ఇన్ సైడ్ టాక్.
