Begin typing your search above and press return to search.

హృదయం లోపల.... 'కింగ్డమ్‌' అంచనాలు రెట్టింపు

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'కింగ్డమ్‌' సినిమాను మే 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   4 May 2025 1:00 AM IST
హృదయం లోపల.... కింగ్డమ్‌ అంచనాలు రెట్టింపు
X

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'కింగ్డమ్‌' సినిమాను మే 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై టీజర్ విడుదల అయినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. తాజాగా హృదయం లోపల అంటూ వచ్చిన పాటతో సినిమా స్థాయి మరో లెవల్‌కి చేరింది. టీజర్ లో యాక్షన్ పార్ట్‌ ఎక్కువగా చూపించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పాటలో కాస్త లవ్‌ అండ్‌ ఎమోషన్స్‌ను చూపించాడు. సినిమాలో ఈ యాంగిల్ కూడా ఉంది అంటూ ఆయన చూపించే ప్రయత్నం చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుకుంటున్నారు.

కింగ్డమ్‌ సినిమా విషయంలో అంచనాలు పెంచే విధంగా దర్శకుడు మెల్ల మెల్లగా ప్రమోషన్స్‌ను చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజా పాట విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాకు అనిరుధ్‌ ఇచ్చిన సంగీతం మరో లెవల్‌లో ఉండబోతుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అనిరుధ్ పాటలు ఉంటాయని అభిమానులు ఈ పాట విడుదల తర్వాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనిరుధ్‌ టాలీవుడ్‌లో మరో మ్యూజికల్‌ బ్లాక్ బస్టర్‌ను ఈ సినిమాతో దక్కించుకోవడం ఖాయం అనే ధీమా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను మే చివరి వారంలో విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. అయినా కింగ్డమ్ సినిమాను మే 30వ తారీకున విడుదల చేస్తామని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. పవన్‌ మూవీ విడుదల అయితే కింగ్డమ్‌ సినిమాను వాయిదా వేస్తామంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ ఇప్పటికే ప్రకటించాడు. వీరమల్లు సినిమా షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో పాటు, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా బ్యాలన్స్ ఉన్న కారణంగా మే చివరి వారంలో విడుదల ఉండక పోవచ్చు. కనుక కింగ్డమ్‌ సినిమా విడుదల అనేది కచ్చితంగా ఉంటుంది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విజయ్‌ దేవరకొండ గత చిత్రం ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో మొదట అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ కంటెంట్‌ను పరిచయం చేసిన తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌ స్టైల్‌ ఇలా ప్రతి ఒక్కటి సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చింది. తాజా పాట విడుదల తో మాస్ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్ సైతం సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర నెవ్వర్ బిఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరి రొమాన్స్ చాలా నేచురల్‌గా ఉండబోతుందని హృదయం లోపల పాటను చూస్తుంటే అనిపిస్తోంది.