Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కొత్త యోధుడు సంసిద్ద‌మ‌వుతున్నాడిలా!

విజ‌య్ దేవ‌ర‌కొండ `కింగ్ డ‌మ్` తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీగా ఉన్నాడు. సినిమాపై అంచ నాలు భారీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   3 July 2025 5:00 PM IST
టాలీవుడ్ కొత్త యోధుడు సంసిద్ద‌మ‌వుతున్నాడిలా!
X

విజ‌య్ దేవ‌ర‌కొండ 'కింగ్ డ‌మ్' తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీగా ఉన్నాడు. సినిమాపై అంచ నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని దేవ‌ర‌కొండ సీరియ‌స్ గా ఉన్నాడు. తాను కూడా ప్రోడ‌క్ట్ పై అంతే కాన్పిడెంట్ గా ఉన్నాడు. రిలీజ్ తేదీపై త‌ర్జ‌న భ‌ర్జ‌న న‌డుస్తోంది. జూలై ముగింపులోనా? ఆగ‌స్టులోనా? క్లారిటీ రావాల్సి ఉంది. మ‌రోవైపు దేవ‌ర‌కొండ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి.

రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇదొక భారీ పీరియాడిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. 1854-1878 కాలాల మ‌ధ్య జ‌రిగే రాయ‌ల సీమ నేప‌థ్యంతో కూడిన స్టోరీ. ఇందులో విజ‌య్ యోధుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఈ సినిమాకు సంబంధించి స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకుటున్నారు. విజ‌య్ -రష్మిక జంట‌గా క‌నిపిం చడానికి కార‌ణంగా ఈ ప్రాజెక్ట్.

వార్ స‌న్నివేశాల‌కు సంబంధించి ఈ ట్రైనింగ్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అలాగే సెట్ నిర్మాణం ప‌నులు హైద‌రాబాద్ లో ప్రారంభ‌మ్యాయి. ఓభారీ సెట్ ను సిటీ ప‌రిస‌ర ప్రాంతాల్లో వేస్తున్నారు. సినిమాకు సంబంధించిన సింహ భాగం షూటింగ్ అంతా అందులోనే జ‌రుగుతుంది. అంటే రాయ‌ల‌సీమ వాతావ‌ర‌ణాన్ని ఆ సెట్ రూపంలో తీసుకొస్తున్నారు.

దాదాపు 60-70 శాతం షూటింగ్ అందులోనూ పూర్త‌వుతుంది. మిగ‌తా స‌న్నివేశాల‌కు సంబంధించి ఔట్ డోర్ షూటింగ్ ఉంటుంది. అదీ విదేశాల్లోన‌ని స‌మాచారం. జూలై రెండవ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది.