కింగ్డమ్ ను సీక్వెల్ లా కాదు.. కింగ్డమ్ లానే చూడండి: నాగవంశీ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
By: Tupaki Desk | 21 July 2025 12:00 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి పీరియాడికల్ నేపథ్యంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్పై జోనర్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కింగ్డమ్.. జులై 31వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో నిర్మాత నాగవంశీ నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూలు ఇచ్చి సందడి చేస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు.
అయితే కింగ్డమ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నాగవంశీ ఆ విషయాన్ని అనౌన్స్ చేశారు. తాజాగా ఆ విషయంపై రెస్పాండ్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో కింగ్డమ్ ను రెండు పార్టులుగా చూడాలా.. లేక సీక్వెల్ గా చూడాలా అని హోస్ట్ అడగ్గా.. అప్పుడు నాగవంశీ అసలేం లేదు.. కింగ్డమ్ ను కింగ్డమ్ లానే చూడాలని అన్నారు.
సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ఆడియన్స్ కు నచ్చితే వెంటనే సీక్వెల్ చేస్తామని తెలిపారు. కథ రెడీగా ఉందని చెప్పారు. స్క్రీన్ ప్లే కూడా సిద్ధమైందని పేర్కొన్నారు. అందుకే సీక్వెల్ లో ఏముంటుంది.. కనెక్షన్ ఏంటనేది తర్వాత చూసుకుందాం.. ముందు సినిమాను కింగ్డమ్ లానే చూడండని అన్నారు. ప్రాపర్ గా కథ ఎండ్ అవుతుందని చెప్పారు.
ఇన్నేళ్ల జర్నీలో ఓ ఫీలింగ్ ఉంటుందని.. సినిమా ప్రమోషన్స్ సహా అన్నీ చూసిన తర్వాత పాజిటివ్ వైబ్స్ వచ్చాయని తెలిపారు. సినిమా ఎంత బాగున్నా.. మార్నింగ్ షో వరకు భయపడతానని చెప్పారు. నిద్ర కూడా పట్టదని అన్నారు. మ్యాజిక్ జరగనున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. సినిమా విషయంలో పాజిటివ్ గా ఉన్నామని.. ఇప్పుడు అలానే ఉందని వెల్లడించారు. అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
