Begin typing your search above and press return to search.

కింగ్‌డ‌మ్ అస‌లు హైలైట్ అదే!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో రౌడీ హీరోగా త‌న‌కంటూ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ఫ్లాపుల్లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 July 2025 3:35 PM IST
కింగ్‌డ‌మ్ అస‌లు హైలైట్ అదే!
X

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో రౌడీ హీరోగా త‌న‌కంటూ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ఫ్లాపుల్లో ఉన్నారు. సినిమాల‌తో త‌న‌కంటూ గొప్ప గుర్తింపును అందుకున్న విజ‌య్ టాలీవుడ్ లో ఓ ప్ర‌త్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నారు. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న విజ‌య్ ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నింటినీ కింగ్‌డ‌మ్ సినిమా పైనే పెట్టుకున్నారు.

కింగ్‌డ‌మ్ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాల‌ని విజ‌య్ చాలా కసితో ఉన్నారు. ఈ సినిమా కూడా విజ‌య్ కు నిరాశ మిగిలిస్తే అత‌ని మార్కెట్ భారీగా దెబ్బ తినే అవ‌కాశ‌ముంది. అందుకే కింగ్‌డ‌మ్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు విజ‌య్. కింగ్‌డ‌మ్ కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్న విజ‌య్ అందులో భాగంగానే బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ ను న‌మ్ముకున్నారు.

కింగ్‌డ‌మ్ సినిమాలో అన్నాద‌మ్ముల సెంటిమెంట్ కు డైరెక్ట‌ర్ గౌత‌మ్ చాలా పెద్ద పీట వేశార‌ని, ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంద‌రూ క‌నెక్ట్ అయ్యేది ఈ కాన్సెప్ట్‌కే అని అంటున్నారు. రీసెంట్ గా రిలీజైన సెకండ్ లిరిక‌ల్ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తుంది. సినిమాలో అన్నాద‌మ్ముల మ‌ధ్య వ‌చ్చే సీన్స్ అన్నింటినీ గౌత‌మ్ నెక్ట్స్ లెవెల్ లో తీశార‌ని స‌మాచారం.

అంద‌రూ భావిస్తున్న‌ట్టు కింగ్‌డ‌మ్ కేవ‌లం శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ మాత్ర‌మే కాద‌ని, దాన్ని మించిన బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ తో డైరెక్ట‌ర్ ఈ సినిమాను రూపొందించార‌ని అంటున్నారు. త‌న అన్న‌కు జ‌రిగిన అన్యాయానికి పోలీసుగా ఉన్న త‌మ్ముడు ఎలాంటి తిరుగుబాటు చేస్తాడ‌నే పాయింట్ ను గౌత‌మ్ చాలా బాగా తెర‌కెక్కించార‌ని ఇన్‌సైడ్ ఇన్ఫ‌ర్మేష‌న్. సినిమాలో అన్నింటికంటే హైలైట్ గా నిలిచేది కూడా అన్న‌ద‌మ్ముల సెంటిమెంటేన‌ని అంటున్నారు.

జులై 31న కింగ్‌డ‌మ్ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ నిర్మాత నాగ వంశీ త‌న ఇంట‌ర్వ్యూలతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసి వార్త‌ల్లోకెక్కారు. వీర‌మ‌ల్లు రిలీజైన ద‌గ్గ‌ర్నుంచి కింగ్‌డ‌మ్ ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ట‌. వీకెండ్ నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య శ్రీ బోర్సే తో పాటూ మిగిలిన టీమ్ కూడా మీడియా ముందుకొచ్చి ప్ర‌మోష‌న్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఆల్రెడీ కింగ్‌డ‌మ్ పై మంచి అంచ‌నాలుండ‌గా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనిరుధ్ ను తీసుకొచ్చి అత‌ని లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా సినిమాపై ఉన్న హైప్ ను మ‌రింత పెంచాల‌నే ఆలోచ‌నలో నిర్మాత నాగ‌వంశీ ఉన్నారు. మ‌రి ఈ సినిమా అయినా విజ‌య్ కు కోరుకున్న స‌క్సెస్‌ను ఇస్తుందేమో చూడాలి.