Begin typing your search above and press return to search.

టాక్ వస్తే.. కింగ్‌డమ్ మోతే

దీంతో విజయ్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా డౌన్ అయిన సంకేతాలు కనిపించాయి. ఇలాంటి టైంలో అతను ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ‘కింగ్‌డమ్’ చేశాడు. ఐతే మేకింగ్ దశలో ఉండగా దీనికి హైప్ తక్కువగానే కనిపించింది కానీ..

By:  Tupaki Desk   |   28 July 2025 3:56 PM IST
టాక్ వస్తే.. కింగ్‌డమ్ మోతే
X

కెరీర్ ఆరంభంలో పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా లాంటి సక్సెస్ ఫుల్‌ సినిమాలతో దూసుకెళ్లాడు విజయ్ దేవరకొండ. తక్కువ టైంలోనే అతను పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడు. కానీ తనపై అంచనాలు పెరిగాక వాటిని అందుకోవడంలో తడబడ్డాడు. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లాంటి డిజాస్టర్లు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఇక లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. దీంతో విజయ్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా డౌన్ అయిన సంకేతాలు కనిపించాయి.

ఇలాంటి టైంలో అతను ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ‘కింగ్‌డమ్’ చేశాడు. ఐతే మేకింగ్ దశలో ఉండగా దీనికి హైప్ తక్కువగానే కనిపించింది కానీ.. రిలీజ్ టైంకి అంతా మారిపోయింది. క్రేజీ టీజర్, ట్రైలర్, పాటలు సినమిాకు కావాల్సిన హైప్ తీసుకొచ్చేశాయి. ముఖ్యంగా లేటెస్ట్‌గా వచ్చిన ట్రైలర్ వేరే లెవెల్ అనిపించింది. దీంతో సినిమా ఫుల్ పాజిటివ్ బజ్ మధ్య రిలీజ్ కాబోతోంది.

బాక్సాఫీస్ దగ్గర కూడా ‘కింగ్‌డమ్’కు అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘హరిహర వీరమల్లు’ రెండో వీకెండ్లో బలంగా నిలబడడం కష్టమే. విజయ్ సినిమాకు థియేటర్ల సమస్య కూడా లేదు. పెద్ద రిలీజ్ ఉండబోతోంది. కావాల్సిందల్లా మంచి టాకే. విజయ్ గత చిత్రాలు తన జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకం చేసినప్పటికీ.. గౌతమ్ తిన్ననూరి అంటే ఆషామాషీగా సినిమా తీయడని, అతణ్ని నమ్మి సినిమాకు వెళ్లొచ్చనే భరోసా ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.

నిర్మాత నాగవంశీ కూడా వరుస విజయాలతో తనకంటూ ఒక క్రెడిబిలిటీ తెచ్చుకున్నాడు. అతను విజయ్ మార్కెట్‌కు మించి సినిమా మీద భారీగా ఖర్చు పెట్టాడు. సినిమా మీద అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్ ఊహించని స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ కూడా గొప్పగా ఉండొచ్చని.. విజయ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌గా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.