ఇక విజయ్ దుమ్ముదులపాల్సిందేనా?
కానీ ఫలితం శూన్యం. చేతులకు పుళ్లుపడేలా శ్రమించినా నమ్మిన డైరెక్టర్ కథ, కథనాలు, క్యారెక్టర్‌ని సరిగా డిజైన్ చేయలేకపోవడం వల్లే `లైగర్` దారుణంగా ఫ్లాప్ అయంది.
By: Tupaki Desk | 3 May 2025 6:37 AMరౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సాలీడ్ బ్లాక్ బస్టర్ పడి ఏళ్లు గడుస్తున్నాయి. గతంలో రాకెట్ స్పీడుతో వ్యవహరిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, మీడియా ఇంటరాక్షన్‌లలో స్పీడు చూపించిన విజయ్ దేవరకొండ `లైగర్` అట్టర్ ఫ్లాప్ తరువాత ఎందుకో బాగా సైలెంట్ అయిపోయాడు. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తొ తొలిసారి సినిమా, ఆయన ట్రాక్ రికార్డ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి క్వశ్చన్‌లు, అనుమానాలు పెట్టుకోకుండా తను ఏది చెబితే అది చేస్తూ విజయ్ `లైగర్` కోసం మూడేళ్లు శ్రమించాడు.
కానీ ఫలితం శూన్యం. చేతులకు పుళ్లుపడేలా శ్రమించినా నమ్మిన డైరెక్టర్ కథ, కథనాలు, క్యారెక్టర్‌ని సరిగా డిజైన్ చేయలేకపోవడం వల్లే `లైగర్` దారుణంగా ఫ్లాప్ అయంది. ఈ సినిమాతో తొలి సారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ దున్నేయాలని ప్లాన్ చేసుకున్న విజయ్ దేవరకొండకు `లైగర్` తేరుకోలేని దెబ్బకొట్టింది. మూడేళ్లు శ్రమించిన సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక డిజాస్టర్ కావడం, అంతే కాకుండా పాన్ ఇండియా కలని తొలి ప్రయత్నంలోనే చిదిమేయడంతో రౌడీ చాలా హార్ట్ అయ్యాడట.
దీంతో అప్పటి నుంచి తన పంథాకు భిన్నంగా విజయ్ దేవరకొండ సైలెంట్ అయిపోయాడు. అయితే త్వరలో `కింగ్‌డమ్` మూవీతో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మళ్లీ పాన్ ఇండియా స్థాయిలో బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో ఉన్నాడట. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న `కింగ్‌డమ్` ఈ నెల 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు.
తాజాగా `హృదయం లోపల...` అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ పాటలో విజయ్ తనదైన రొమాన్స్‌తో `అర్జున్‌రెడ్డి` నాటి రోజుల్ని గుర్తు చేయడంతో రౌడీ ఫ్యాన్స్ ఇక దుమ్ముదులపాల్సిందేనని కామెంట్‌లు చేస్తున్నారు. మే ప్రారంభంలో హిట్ 3తో నాని శేభారంభాన్ని అందించాడని, దాన్ని కంటిన్యూ చేస్తూ విజయ్ `కింగ్‌డమ్`తో బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులపాలంటున్నారు. సినిమా కూడా అంతా ఊహించిన దానికి మించి ఉంటుందని, ఈ సారి రౌడీ బిగ్ హిట్‌తో రీసౌండ్ ఇవ్వడం ఖాయమనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మరి రౌడీ ఈ సారి దుమ్ముదులుపుతాడా? లేదా అన్నది తెలియాలంటే మే 30 వరకు వేచి చూడాల్సిందే.