Begin typing your search above and press return to search.

విజయ్ ను టార్గెట్ చేశారు.. కింగ్ డమ్ తో అందరి లెక్కలు తేలుస్తాడు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం సాలిడ్ హిట్ అవసరం. గీతా గోవిందం తర్వాత విజయ్ కు పెద్ద హిట్ పడలేదు.

By:  Tupaki Desk   |   15 July 2025 3:00 PM IST
విజయ్ ను టార్గెట్ చేశారు.. కింగ్ డమ్ తో అందరి లెక్కలు తేలుస్తాడు
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం సాలిడ్ హిట్ అవసరం. గీతా గోవిందం తర్వాత విజయ్ కు పెద్ద హిట్ పడలేదు. ఆ తర్వాత తీసిన సినిమాలు డియర్ కామ్రేడ్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేదు. ఆ క్రమంలోనే తన నటనకు బాగా ట్రోల్ అయ్యాడు కూడా.

ఇక ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ కింగ్ డమ్ సినిమాపైనే ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా ఈనెన 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై విజయ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కింగ్ డమ్ తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని నిర్మాత నాగవంశీ కుడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఓ సందర్భంలో మాట్లాడిన ఆయన, చాలా మంది విజయ్ ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

విజయ్ దేవరకొండను ప్రజలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్ని ఫ్లాప్ ల కారణంగా విజయ్ కెరీర్ అనుకున్నట్లు సాగడం లేదు. ఇటీవల రెట్రో ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన చిన్న స్టేట్ మెంట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో అతను టార్గెట్ అయ్యాడు. అయితే కెరీర్ ప్రారంభంలో విజయ్ కాస్త దూకుడుగానే మాట్లాడేవాడు.

కానీ, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఆలోచించి ఆచితూచి మాట్లాడుతున్నాడు. కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటున్నాడు. వాస్తవానికి ప్రజలు అతడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.వ్యక్తిగతంగా మాట్లాడితే తెలుస్తుంది విజయ్ అంటే ఏంటో. స్టేజ్ పై అగ్రెసివ్ గా మాట్లాడే విజయ్ ఆఫ్ ది కెమెరా కూల్ గా ఉండడం చూస్తే ఆశ్చర్యపోతారు.

అసలు స్టేజ్ పై మాట్లాడే విజయ్, ఈ విజయ్ ఒక్కరేనా అనిపిస్తుంది. తనపై ప్రేక్షకులు కొంత్తైనా కరుణతో ఉండడం లేదు. అయితే కింగ్‌ డమ్ ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అని ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నారు. కాగా, ఈ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ జానర్గా తెరకెక్కింది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.

అయితే కెరీర్ తొలి నాళ్లలో విజయ్ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాలతో సూపర్ హిట్ విజయాలు దక్కించుకున్నాడు. దీంతో టాలీవుడ్ లో తొందరగానే స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోతాడని అనుకున్నారంతా. కానీ, గీతాగోవిందం తర్వాత విజయ్ కు సరైన హిట్ రాలేదు. టాక్సీవాలా కొంతవరకూ ఆడినా, డియర్ కామ్రేడ్, లైగర్ పూర్తిగా నిరాశపర్చాయి.