కింగ్ డమ్.. టోటల్ బడ్జెట్ ఎంత?
"కింగ్ డమ్" కోసం మొదటే భారీ బడ్జెట్ అనుకోలేదని, అయితే డిలేలు, సాంకేతిక సమస్యల వల్ల మళ్లీ మళ్లీ ప్లాన్లలో మార్పులు వచ్చాయని అన్నారు.
By: Tupaki Desk | 21 July 2025 2:35 PM ISTవిజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్టు చూసి చాలా కాలమైంది. గతంలో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో "కింగ్ డమ్" సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కంటెంట్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 31న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.
ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా చర్చలో ఉన్నది బడ్జెట్. ఎందుకంటే ఈ మూవీ రికార్డ్ స్థాయిలో ఖర్చుతో తెరకెక్కించినట్లు టాక్ వచ్చింది. ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. "కింగ్ డమ్" కోసం మొదటే భారీ బడ్జెట్ అనుకోలేదని, అయితే డిలేలు, సాంకేతిక సమస్యల వల్ల మళ్లీ మళ్లీ ప్లాన్లలో మార్పులు వచ్చాయని అన్నారు.
దీంతో మొత్తంగా 15 నుంచి 20 శాతం వరకు ఖర్చు పెరిగిపోయిందని తెలిపారు. టోటల్ బడ్జెట్ రూ.130 కోట్ల వరకు వెళ్లిందని పేర్కొన్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. "విజయ్ మార్కెట్ రేంజ్ కన్నా ఎక్కువ బడ్జెట్ అయినప్పటికీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై నమ్మకంతోనే ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టాం. ఆయన కథపై, కథనంపై నాకున్న కాన్ఫిడెన్స్ ఈ నిర్ణయానికి కారణం" అని అన్నారు.
ఈ సినిమాపై ఉన్న నమ్మకం వల్లే భారీ రిస్క్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి రైట్స్‌ను సొంతం చేసుకుందట. అదే సమయంలో థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేట్లకే అమ్ముడయ్యాయి. బడ్జెట్ చాలా ఎక్కువ అయినా, కంటెంట్ మీద నమ్మకం ఉండటం వల్లే భారీగా ఖర్చు పెట్టారని నిర్మాత మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడితేనే.. పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుంది. కథన పరంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అనిరుధ్ సంగీతం ఇప్పటికే బజ్ తెచ్చింది. సినిమా హిట్టవుతుందన్న అంచనాల మధ్య, నిజంగా "కింగ్ డమ్" విజయ్ దేవరకొండకి కింగ్ సైజ్ విజయాన్ని అందిస్తుందా అనేది త్వరలో తెలుస్తుంది.
