దేవరకొండ బినామీ.. ఇది అసలు మ్యాటర్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 4:53 PMటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు కింగ్ డమ్ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. మే 30వ తేదీన రిలీజ్ కానుంది. ఆ తర్వాత రవికరణ్ కోలా, రాహుల్ సంకృత్యాన్ తో వర్క్ చేయనున్నారు. ఇప్పటికే ఆ రెండు సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చేశాయి. రెండూ కూడా పాన్ ఇండియా చిత్రాలతే. దీంతో కొంతకాలం వరకు దేవరకొండ బిజీనే.
అదే సమయంలో తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో ఓ మూవీ చేస్తారని కొద్ది రోజుల క్రితం అనుకున్నారు. ఆ తర్వాత దాని కోసం ఎలాంటి అప్డేట్ లేకపోగా.. ఇప్పుడు కొంతకాలంగా వైరల్ అవుతోంది. టైటిల్ బినామీ అని.. త్వరలో సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ విజయ్ దేవరకొండ బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు ఆ కాంబో సెట్ అవ్వడం కష్టమే. వస్తున్న వార్తలు రూమర్లుగా తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్.. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీతోనే కెరీర్ స్టార్ట్ చేశారు. డెబ్యూతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ కమర్షియల్ హిట్ సొంతం చేసుకోలేకపోయారు.
రెండేళ్ల క్రితం కీడా కోలా మూవీ తీశారు. కానీ నిరాశపరిచారు. కొంతకాలంగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై వర్క్ చేస్తున్నారు. కొత్త క్యాస్టింగ్ తో వర్క్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. అదే సమయంలో ఆయన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన జయ జయ జయ జయహే మూవీ రీమేక్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. తెలుగు నేటివిటీ తగ్గట్లు ఆ సినిమాను ఛేంజ్ చేయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు సమాచారం. మరి అటు డైరెక్టర్ గా.. ఇటు నటుడిగా ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.