Begin typing your search above and press return to search.

విజయ్ 'కింగ్డమ్' దూకుడు.. ప్రీమియర్స్ ప్లాన్ లో మేకర్స్?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. మరికొద్ది రోజుల్లో కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  Tupaki Desk   |   28 July 2025 11:33 AM IST
Vijay Deverakonda’s Kingdom Sets Massive Hype Ahead of Release
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. మరికొద్ది రోజుల్లో కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జైలు డ్రామా, స్పై జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.


టాలెంటెడ్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. పలువురు నటీనటులు కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ.. జులై 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ అంచనాలను అందుకుంది. మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దీంతో అంతా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. విజయ్ కు హిట్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. ఓ రేంజ్ లో సేల్స్ జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 30 వేల టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకా పూర్తి స్థాయిలో బుకింగ్స్ తెరవకముందే.. కింగ్డమ్ తన సత్తా చాటుతోంది. మరోవైపు, సినిమా రిలీజ్ కు ముందు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

జులై 30వ తేదీన రాత్రి పెద్ద ఎత్తున మేకర్స్ ప్రీమియర్స్ ను వేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయని.. కొన్ని గంటల్లో అనౌన్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రీమియర్స్ పడ్డాక మౌత్ టాక్ పాజిటివ్‌ గా ఉంటే మేకర్స్ కు తిరుగులేదు. ఓ రేంజ్ లో సినిమా దూసుకుపోవడం పక్కా.

కానీ ఏదైనా కాస్త తేడా కొడితే.. ఆ తర్వాత టాక్ స్ప్రెడ్ అయ్యి వసూళ్లపై దెబ్బ పడుతుంది. కాబట్టి పెయిడ్ ప్రీమియర్స్ వేయడం నిజమైతే.. ఇప్పుడు కింగ్డమ్ మేకర్స్ రిస్క్ చేస్తున్నారని చెప్పాలి. అదే సమయంలో కొంతకాలంగా విజయ్ దేవరకొండ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కింగ్డమ్ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.