విజయ్ హీరోయిన్స్ పై క్లారిటీ ఎప్పుడు..?
ఆమె కాకపోతే మరొకరిని ఫిక్స్ చేయాల్సి ఉంది. మరోపక్క వీడీ 14 సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అని అంటున్నారు.
By: Tupaki Desk | 10 May 2025 8:15 AM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డం ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. ఆ సినిమా తర్వాత విజయ్ రెండు భారీ సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తుండగా మరో సినిమా రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ గా ఈ సినిమా వస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతున్నారట.
ఇక ఈ సినిమాతో పాటుగా రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో విజయ్ సినిమా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కూడా ఈ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఐతే వీడీ 13, 14 సినిమాలుగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అంతా ఓకే కానీ హీరోయిన్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. వీడీ 13 సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ డిస్కషన్ లో ఉందని టాక్.
ఆమె కాకపోతే మరొకరిని ఫిక్స్ చేయాల్సి ఉంది. మరోపక్క వీడీ 14 సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అని అంటున్నారు. కానీ మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ తో జత కడుతున్నాడు. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ రెండో సినిమానే విజయ్ తో నటించడం ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక వీడీ 13, 14 సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో కూడా క్లారిటీ వస్తే బాగుంటుందని రౌడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా విజయ్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు మంచి వెయిట్ ఉంటుంది. అంతేకాదు వాళ్లతో విజయ్ దేవరకొండ చేసే రొమాన్స్ కూడా కాలిక్యులేట్ అవుతాయి. భాగ్య శ్రీ తో కూడా లిప్ లాక్ చేసి సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఉంటుందని చూపించాడు. మరి నెక్స్ట్ సినిమాల్లో కథానాయికల విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
విజయ్ దేవరకొండ తో నటించే హీరోయిన్స్ కూడా క్రేజీగా ఫీల్ అవుతారు. యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ తో ఛాన్స్ వస్తే తప్పకుండా జత కట్టాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది.