Begin typing your search above and press return to search.

రౌడీ హీరో ఇంత సైలెంట్ ఎందుక‌య్యాడు?

సినిమా ఫంక్ష‌న్‌ల‌లో ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తూ ఓ రేంజ్‌లో సంద‌డి చేసిన ఈ హీరో `లైగ‌ర్‌` డిజాస్ట‌ర్ త‌రువాత చాలా వ‌ర‌కు సైలెంట్ అయిపోయాడు.

By:  Tupaki Desk   |   10 April 2025 1:30 PM
రౌడీ హీరో ఇంత సైలెంట్ ఎందుక‌య్యాడు?
X

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రు ఎప్పుడు లైమ్‌లైట్‌లోకి వ‌స్తారో ఎవ‌రు ఎప్పుడు సైలెంట్‌గా అయిపోతారో చెప్ప‌డం క‌ష్టం. జీరోగా ఉన్న‌వారు హీరో అవ్వొచ్చు..హీరోగా ఉన్న‌వారు ఇక్క‌డ జీరోలుగా మారిన సంద‌ర్భాలున్నాయి. రాత్రికి రాత్రే జాత‌కాలు మారే ఇండ‌స్ట్రీ ఇది. అలా ఒక్క‌సారిగా రైజ్ అయిన హీరో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చిన్ని చిన్న క్యారెక్ట‌ర్‌ల‌తో న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ రౌడీ స్టార్ `అర్జున్‌రెడ్డి` మూవీతో పాథ్‌బ్రేకింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకుని టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిల‌వ‌డం తెలిసిందే.

త‌క్కువ టైమ్ పీరియ‌డ్‌లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా త‌న‌దైన మార్కు కార్య‌క్ర‌మాల‌తో అంద‌రిలో హాట్ టాపిక్ అయ్యాడు. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుతూ త‌క్కువ టైమ్‌లోనే హీరోగా భారీ క్రేజ్‌ని సొంత చేసుకున్నాడు. సినిమా ఫంక్ష‌న్‌ల‌లో ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తూ ఓ రేంజ్‌లో సంద‌డి చేసిన ఈ హీరో `లైగ‌ర్‌` డిజాస్ట‌ర్ త‌రువాత చాలా వ‌ర‌కు సైలెంట్ అయిపోయాడు.

స‌మంత‌తో క‌లిసి చేసిన `ఖుషి` ఫ‌ర‌వాలేద‌నిపించ‌డంతో చాలా వ‌ర‌కు సైలెంట్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న `కింగ్‌డ‌మ్‌`లో న‌టిస్తున్నాడు. ఇదొక స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ సంగీతం ఇస్తున్న ఈ మూవీ మే 30న పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

ఫిబ్ర‌వ‌రి 12న ఈ మూవీ టీజ‌ర్‌ని మేక‌ర్స్ ఐదు భాష‌ల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌, త‌మిళంలో సూర్య‌, హిందీలో ర‌ణ్‌బీర్ క‌పూర్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. రౌడీ హీరో, ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ సినిమా అనిరుధ్ సంగీతం అందిస్తుండ‌టంతో అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. ఈ మూవీతో మ‌ళ్లీ త‌న సత్తా చాటుకొని మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో రౌడీ హీరో ఉన్నాడు. ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది తెలియాలంటే మే 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.