విజయ్ ఎలా రియాక్ట్ కాబోతున్నాడు?
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 2 May 2025 12:45 PM ISTటాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ `లైగర్` టైమ్‌లో ఏం చేసినా అది వివాదాలకు దారి తీయడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో విజయ్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయా? అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం `కింగ్‌డమ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. హాట్ లేడీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
టీజర్‌తో అంచనాల్ని పెంచేసిన ఈ మూవీని మే 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. సినిమా మరో 28 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆయనపై పలువురు కేసులు పెట్టే ప్రయత్నం చేయడకలవరపెడుతోంది. వివరాల్లోకి వెళితే... హరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ `రెట్రో`. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గుఉఉవారం విడుదలై ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. పహల్గావ్ ఘటన దురదృష్టమని, చాలా బాధకరమన్నారు. కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలకు కారణం చదువు లేకపోవడమేనని, వాళ్లందరికి చదువు చెప్పించి బ్రెయిన్ వాష్ కాకుండా శిక్షణ ఇప్పించాలి అన్నారు. ఇదే క్రమంలో పాకిస్థాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి గిరిజనులు అంటూ వ్యాఖ్యానించాడు.
ఇదే ఇప్పుడు వివాదానికి తెరలేపింది. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచే విధంగా ఉన్నాయని పలు గిరిజన సంఘాలు వాపోతున్నాయి. బేషరతుగా విజయ్ దేవరకొండ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్టేషన్‌లో లాయర్ కిషన్ హీరో విజయ్ దేవరకొండపై కేసు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై న్యాయ సలహా తీసుకున్న తరువాతే కేసు ఫైల్ చేస్తామని పోలీస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ కూడా విజయ్ దేవరకొండపై ఫైర్ అయింది. మరి తాజా వివాదంపై రౌడీ హీరో ఎలా స్పందిస్తాడో వేచి చూడాలని అంతా ఎదురు చూస్తున్నారు. `అర్జున్ రెడ్డి` టైమ్‌లో కాంగ్రెస్ నాయకుడు వీహెచ్‌ని లైట్ తీసుకున్నట్టే తాజా వివాదాన్ని కూడా విజయ్ లైట్ తీసుకుంటాడా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
