పొలిటికల్ ఎంట్రీపై విజయ్ ఆంటోనీ కామెంట్స్
చిత్ర రిలీజ్ దగ్గర పడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోనీ మీడియాతో మాట్లాడి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
By: Tupaki Desk | 24 July 2025 12:00 AM ISTమ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఆ తర్వాత హీరోగా కూడా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా మారిన విజయ్ ఆంటోనీ ఇప్పటికే 24 సినిమాలు చేయగా, త్వరలోనే ఆయన్నుంచి తన మైల్ స్టోన్ ఫిల్మ్ అయిన 25వ సినిమా కూడా రాబోతుంది. భద్రకాళి టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. చిత్ర రిలీజ్ దగ్గర పడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోనీ మీడియాతో మాట్లాడి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే ప్రజా సేవ చేయాలంటే రాజకీయాలే బెస్ట్ ఆప్షన్ అని వ్యాఖ్యానించారు విజయ్ ఆంటోనీ.
తమ సినిమా కేవలం పొలిటికల్ జానర్ లో మాత్రమే తెరకెక్కిందని, సినిమాకు ఏ పార్టీతోనూ సంబంధముండదని చెప్పిన ఆయన, ఈ సినిమాకు ముందు పరాశక్తి అనే టైటిల్ ను అనుకున్నామని, కానీ ఆ టైటిల్ వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకోవడంతో సినిమా పేరును భద్రకాళిగా మార్చాల్సి వచ్చిందని, 25 సినిమాలు చేసిన తాను ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నానని, నటుడిగా ప్రేక్షకుల నుంచి గుర్తింపు తెచ్చుకోవడం కంటే గొప్ప వరమేమీ ఉండదన్నారు.
ఈ మధ్య సినీ ప్రముఖులంతా రాజకీయాల్లోకి వస్తున్నారు కదా మీరు కూడా వస్తారా అని అడగ్గా, దానికి ఆయన స్పందిస్తూ తనకు రాజకీయ రంగంపై ఆసక్తి లేదని, తన ఆసక్తి మొత్తం సినిమాలపైన, మ్యూజిక్ పైనే అని చెప్పారు. సినిమాలు తన బాధ్యత అని, తల్లి పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో తాను కూడా సినిమా విషయంలో అంతేనని అన్నారు.
ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మామూలుగా ఒకేసారి కొంతమందికి మాత్రమే చేయగలమని కానీ పాలిటిక్స్ లోకి వెళ్తే ఎంతమందికైనా ఒకేసారి సేవ చేయొచ్చని, దానిపై ఆసక్తి ఉన్న వాళ్లెవరైనా ఆ రంగంలోకి వెళ్లొచ్చని, కానీ తనకు దానిపై ఇంట్రెస్ట్ లేదని విజయ్ ఆంటోనీ చెప్పారు. రెండు నెలలకు ఓ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న విజయ్ ఆంటోనీ అన్నింటినీ డబ్బుతోనే చూడలేమని, ప్రేక్షకుల అభిమానమే ముఖ్యమని, ఆ విషయంలో తాను చాలా సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు.
