విజయ్ ఆంటోని కవరింగ్.. అయినా వెనక్కి తగ్గని నెటిజెన్లు..!
విజయ్ ఆంటోని పెట్టిన కామెంట్ పై ఇక్కడ ఎంతమంది అమ్మాయకులు చనిపోయినా పాక్ లో ఉన్న ఇండియన్స్ గురించి ఆలోచిస్తున్నావా అంటూ అతన్ని ఎటాక్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 April 2025 10:22 PM ISTబిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని ఎరక్కపోయి వచ్చి ఇరుక్కోయాను అన్నట్టుగా పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడిపై రీసెంట్ గా అతను చేసిన కామెంట్ హా*ట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అతను ఏం రాసుకొచ్చాడు అంటే పాకిస్థాన్ లో 50 లక్షల భారతీయుల గురించి మనం ఆలోచించాలి.. వాళ్లు శాంతి, సంతోషం కోరుకుంటున్నారు.. ఇన్ డైరెక్ట్ గా మన ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి పునరాలోచన చేయమని అన్నట్టుగా అర్ధమవుతుంది.
విజయ్ ఆంటోని కామెంట్స్ పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. విజయ్ ఆంటోని పెట్టిన కామెంట్ పై ఇక్కడ ఎంతమంది అమ్మాయకులు చనిపోయినా పాక్ లో ఉన్న ఇండియన్స్ గురించి ఆలోచిస్తున్నావా అంటూ అతన్ని ఎటాక్ చేస్తున్నారు. అంతేకాదు 50 లక్షల మంది ఉన్నారని ఎలా తెలుసు.. ఏదైనా డేటా ఉందా సాక్షాలు ఉన్నాయా అంటూ అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ఐతే ప్రస్తుతం ఈ సీరియస్ ఇష్యూపై ఎలాంటి కామెంట్ చేసినా జనాలు ఇలానే స్పందిస్తున్నారు.
ఇక తన తప్పుని గుర్తించిన విజయ్ ఆంటోని వెంటనే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. లేటెస్ట్ గా మరో కొత్త మెసేజ్ ని తన సోషల్ మీడియాలో పెట్టాడు విజయ్ ఆంటోని. ఇంతకీ ఈసారి ఏమని రాసుకొచ్చాడు అంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు మనం కూడా అందరం కలిసి టెర్రరిస్టులను అంతం చేయాలని.. మన ఐక్యత దెబ్బ తీసే వాళ్ల ప్రయత్నాలు ఆపేయాలని రాసుకొచ్చాడు.
దేశంలో జరుగుతున్న సెన్సిటివ్ ఇష్యూ పై విజయ్ ఆంటోని మొదటిసారి ఒకలా స్పందించి దాని వల్ల అతను టార్గెట్ అవగా.. మరోసారి మాట మార్చి కొత్త మెసేజ్ తో వచ్చాడు. అందుకే దేశ భద్రత ఇంకా దాడుల విషయంలో ఎలా పడితే అలా మాట్లాడకుండా కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇది విజయ్ ఆంటోని అనే కాదు ఇలాంటి టైం లో ఎవరు ఏ ఉద్దేశంతో అయినా ఇష్యూని డైవర్ట్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.
ఉగ్రదాడి జరిగిన టైం లో అందరు తమ స్పందన తెలియచేశారు. ఐతే వారిపై నెటిజెన్లు ఎవరు ఎటాక్ చేయలేదు. కానీ విజయ్ ఆంటోని తన స్పందనలో కాస్త కొత్తదనం కోసం పాకిస్థాన్ లో ఉన్న భారతీయులు అంటూ ప్రస్తావించారు. ఐతే అతను అనుకున్న దాని కన్నా రెస్పాన్స్ భిన్నంగా వచ్చింది. అందుకే మళ్లీ మాట మార్చి ప్రభుత్వానికి సహకరిద్దామని మెసేజ్ పెట్టాడు.
