బిచ్చగాడు హీరో.. ఈసారి కూడా ఫోకస్ పడట్లే..
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీకి ఉన్న క్రేజే వేరు. వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రయోగాలు చేసే ఆయన.. మల్టీ టాలెంట్ తో మెప్పిస్తుంటారు
By: Tupaki Desk | 29 Jun 2025 12:01 PM ISTకోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీకి ఉన్న క్రేజే వేరు. వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రయోగాలు చేసే ఆయన.. మల్టీ టాలెంట్ తో మెప్పిస్తుంటారు. బిచ్చగాడు సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ ను ఇచ్చింది. నటుడిగా.. నిర్మాతగా.. సంగీత దర్శకుడిగా సందడి చేస్తుంటారు. ఇప్పుడు లీడ్ రోల్ లో నటిస్తూ.. మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన మార్గన్: ది బ్లాక్ డెవిల్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరల్డ్ వైడ్ గా తమిళంతో పాటు తెలుగులో విడుదలైంది సినిమా.
క్రైమ్ థ్రిల్లర్ గా లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ థియేటర్స్ లో విడుదల చేసింది. అయితే రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ.. లియో జాన్ పాల్ మేకింగ్ కు అంతా ఫిదా అయ్యారు. క్లైమాక్స్ కాస్త మైనస్ అయినా ఓవరాల్ గా మూవీ మంచి థ్రిల్ పెంచుతుందని చెబుతున్నారు.
ట్విస్టులు, స్క్రీన్ ప్లే, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ వగైరా అంశాలు టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. కానీ తెలుగులో ప్రమోషన్స్ తక్కువ అవ్వడంతో ఇప్పుడు మార్గన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మన దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా అనుకున్నంత స్థాయిలో క్లిక్ అవ్వలేదు. అందుకే మూవీపై తెలుగు ఆడియెన్స్ ఫోకస్ పడలేదు.
అదే పెద్ద మైనస్ గా మారింది. అందుకే మార్నింగ్ షోకు ఆడియెన్స్ పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత మూవీ టాక్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. దీంతో ఈవెనింగ్ షో నుంచి ఆడియన్స్ సంఖ్య పెరిగింది. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదు. ప్రమోషన్స్ లో కాస్త జోష్ పెంచితే మంచి వసూళ్లు వస్తాయి. యావరేజ్ ఎబొవ్ టాక్ వస్తుంది కాబట్టే ప్రమోట్ చేస్తే చాలు.
అయితే కోలీవుడ్ లో మార్గన్ మూవీ అలరిస్తోంది. తమిళ వెర్షన్ విషయంలో విజయ్ ఆంటోనీ రంగంలోకి దిగారు. మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ తో మీట్స్ నిర్వహిస్తున్నారు. అలా మూవీపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏ మూవీ అయినా ప్రమోషన్ ఎంత ముఖ్యమో మార్గన్ మరోసారి ప్రూవ్ చేసింది.
అదే సమయంలో విజయ్ ఆంటోనీకి మంచి హిట్ దక్కి చాలా కాలం అయింది. బిచ్చగాడు మూవీ తర్వాత భారీ హిట్ అందుకోలేకపోయారు. బిచ్చగాడు 2తో పర్వలేదనిపించారు. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ గా మారాయి. ఇప్పుడు మార్గన్ తో మెప్పించినా ప్రమోషన్స్ లేకపోవడం వల్ల దెబ్బ పడింది. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
