Begin typing your search above and press return to search.

విజయ్ ఆంటోనీ 'మార్గన్'.. యూట్యూబ్ లో 6 నిమిషాల మూవీ రిలీజ్

క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్ లో రూపొందుతున్న మార్గన్ మూవీలో సముద్ర ఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 9:27 AM IST
విజయ్ ఆంటోనీ మార్గన్.. యూట్యూబ్ లో 6 నిమిషాల మూవీ రిలీజ్
X

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు మార్గన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మర్డర్ మిస్టరీ గా లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.

క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్ లో రూపొందుతున్న మార్గన్ మూవీలో సముద్ర ఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ ఆంటోనీ మేన‌ల్లుడు అజ‌య్ ధీష‌న్ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. మార్గన్ మూవీతోనే ఆయన సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మార్గన్.. మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్న మేకర్స్.. ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించారు. ఇప్పుడు కూడా సందడి చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే మార్గన్ మూవీ తెలుగులోనూ రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తొలి ఆరు నిమిషాల విజువల్స్‌ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటోంది. సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.

వీడియో అంతా మిస్టరీ, సస్పెన్స్ తో సాగింది. మూవీలో మెయిన్ క్యాస్టింగ్ ను మేకర్స్ పరిచయం చేశారు. విజువల్స్ చాలా నేచరుల్ గా ఉన్నాయి. విజయ్ ఆంటోనీ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ గా సెట్ అయింది. ఆయన యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ప్రతీ సీన్ లో కూడా తన నేచురల్ యాక్టింగ్ తో మెప్పించేశారు విజయ్.

ఓవరాల్ గా 6 మినిట్స్ వీడియో హైలెట్ గా ఉందని చెప్పాలి. మూవీపై ఇంట్రెస్ట్ పెంచిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. వీడియోలో ప్రతి ఎలిమెంట్ కూడా ఆసక్తి పెంచేలా ఉందని అంటున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అని కొందరు సినీ ప్రియులు చెబుతున్నారు. మరి మీరు ఆ వీడియోను చూశారా?