మామ హీరో..మేనల్లుడు విలన్!
ఇండస్ట్రీలో బంధు ప్రీతి సహజం. అలాగని అందరూ సక్సెస్ అవ్వరు. కొందరు మాత్రమే స్టార్లు అవ్వగలరు.
By: Tupaki Desk | 15 May 2025 11:16 AM ISTఇండస్ట్రీలో బంధు ప్రీతి సహజం. అలాగని అందరూ సక్సెస్ అవ్వరు. కొందరు మాత్రమే స్టార్లు అవ్వగలరు. ఎంత బ్యాకప్ ఉన్నా? ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే ఇక్కడ సక్సస్ అయ్యేది. ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోల మేనల్లుళ్లు కూడా హీరోలగా సక్సస్ అయిన సంగతి తెలి సిందే. రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాశ్ హీరోగా. మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు.
ఛోటా కే. నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ తమిళ్...తెలుగులో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మె గాస్టార్ చిరంజీవి ఇద్దరు మేనల్లుళ్లు సాయితేజ్..వైష్ణవ్ తేజ్ లు కూడా స్టార్లు అయిన సంగతి తెలిసిందే. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పరిశ్రమ ల్లోనూ చాలా మంది మేనల్లుళ్లు తేలతారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దీషన్ కూడా లాంచ్ అయ్యాడు.
విజయ్ ఆంటోనీ హీరో గానటిస్తోన్న `మార్గన్` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఏకంగా మామనే ఎటాక్ చేస్తు న్నాడు. శక్తవంతమైన విలన్ పాత్ర అజయ్ దీషన్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అధికారి కంగానూ వెల్లడించారు. అజయ్ కి నటుడిగా ఇదే తొలిసినిమా కావడంతో మామ కావాల్సినన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కతుంది. విజయ్ ఆంటోనీకి ఇలాంటి జానర్లు బాగా కలిసొచ్చాయి. అతడిని స్టార్ గా చేసింది ఈ తరహా సినిమాలే. అందుకే తాను ఏసినిమా చేసినా క్రైమ్ అన్నది హైలైట్ అవుతుంది. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌తోనే మామ-అల్లుడి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలున్నట్లు తెలుస్తోంది. యాక్ష న్ సన్నివేశాలకు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్ ఇచ్చేలా ఉంది. జూన్ లో చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
