అతనికి మరో బిచ్చగాడు దొరకాలి..!
కోలీవుడ్ లో విజయ్ ఆంటొని తీస్తున్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అతను నటించిన పిచ్చైకారన్ అదే తెలుగులో బిచ్చగాడు గా రిలీజై సంచలన విజయం అందుకుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 8:00 AM ISTకోలీవుడ్ లో విజయ్ ఆంటొని తీస్తున్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అతను నటించిన పిచ్చైకారన్ అదే తెలుగులో బిచ్చగాడు గా రిలీజై సంచలన విజయం అందుకుంది. తెలుగులో ఒక డబ్బింగ్ సినిమా నేరుగా 100 రోజులు ఆడటం చాలా ఏళ్ల తర్వాత బిచ్చగాడు సృష్టించిన సంచలన రికార్డ్ ఉంది. విజయ్ ఆంటోని హీరోగా శశి డైరెక్షన్ లో తెరకెక్కించ్ బిచ్చగాడు సినిమా అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
బిలీనియర్ అయిన హీరో తల్లి కోసం బిచ్చగాడిగా మారిన కథ ఆ కథను నడిపించిన కథనం అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి. సెంటిమెంట్ సినిమాలను బాగా ఎంకరేజ్ చేసే తెలుగు వాళ్లకు బిచ్చగాడు సినిమా బాగా నచ్చింది. అందులోనూ మదర్ సెంటిమెంట్ అవ్వడంతో బిచ్చగాడు రికార్డులు సృష్టించింది. ఆ సినిమా ఇచ్చిన హై తోనే విజయ్ ఆంటోని పాత సినిమాలకు క్రేజ్ పెరిగింది. వరుసగా వాటిని డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఇక బిచ్చగాడు తర్వాత తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న విజయ్ ఆంటోని వరుసగా తన సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ వచ్చాడు. బేతాళుడు, బిచ్చగాడు 2 తప్ప మిగతా సినిమాలన్నీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఐతే విజయ్ ఆంటోని కెరీర్ లో మరో బిచ్చగాడు కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి ఒక సూపర్ హిట్ పడితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చని అనుకుంటున్నాడు .
బిచ్చగాడు 2 తర్వాత తీస్తే మళ్లీ బిచ్చగాడు 3 తీయాలి. ఐతే టైటిల్ పెట్టినంత ఈజీగా కథ కుదరదు. అందుకే బిచ్చగాడు టైటిల్ కి సరిగా కుదిరే కథ కోసం వెతుకుతున్నారట. విజయ్ ఆంటోని ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. సరైన కథ కథనాలు కుదిరితే మాత్రం బిచ్చగాడు వల్ల వచ్చిన ఇమేజ్ తో విజయ్ ఆంటోని తప్పకుండా తిరిగి తెలుగులో ఫాంలోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు విజయ్ ఆంటోనితో తెలుగు స్ట్రైట్ సినిమా చేసినా సరే ఆయనకు ఉన్న మార్కెట్ కి వర్క్ అవుట్ అవుతుంది. మరి మన దర్శకులు ఎవరు అలాంటి అటెంప్ట్ చేయాలన్న ఆలోచన రావడం లేదెందుకో అర్ధం కావట్లేదు. ఏది ఏమైనా విజయ్ ఆంటోని మరో మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించాలని ఆడియన్స్ కోరుతున్నారు.
