Begin typing your search above and press return to search.

మొత్తం లాస్ అయ్యా.. అందుకు సినిమాలు తీస్తున్నా!: విజయ్ ఆంటోనీ

మల్టీ టాలెంటెడ్ గా ఫుల్ గా సందడి చేస్తుంటారు. ఇప్పుడు లీడ్ రోల్ లో నటిస్తూనే.. మార్గన్ మూవీని గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2025 3:47 PM IST
మొత్తం లాస్ అయ్యా.. అందుకు సినిమాలు తీస్తున్నా!: విజయ్ ఆంటోనీ
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి అందరికీ తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌ గా ఎప్పుడూ ఆడియన్స్ ను మెప్పిస్తూనే ఉంటారు. మల్టీ టాలెంటెడ్ గా ఫుల్ గా సందడి చేస్తుంటారు. ఇప్పుడు లీడ్ రోల్ లో నటిస్తూనే.. మార్గన్ మూవీని గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న మార్గన్ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్ పై ఆయన నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కూడా రిలీజ్ కానుంది. మన దగ్గర ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తుంది.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఆంటోనీ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కీలక విషయాలు రివీల్ చేశారు. మీ దగ్గర ఉన్న డబ్బులు.. సంపాదిస్తున్న డబ్బులు.. సినిమాల్లోనే మళ్లీ పెడుతున్నారు అని హోస్ట్ అన్నారు. దీంతో తనకేం రావడం లేదని, అప్పులు చేసి పెడుతున్నానని విజయ్ చెప్పారు.

బిచ్చగాడు 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా అని హోస్ట్ అనగా.. తాను ఓ ఇద్దరు- ముగ్గురు వల్ల మొత్తం నష్టపోయానని చెప్పారు. "మీ కంపెనీలో బ్లాక్ షీప్స్ ఉన్నాయా" అని అడగ్గా.. "లేదు లేదు నా లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ను మిస్ హ్యాండిల్ చేశా.. అందువల్ల నష్టపోయా.. నేనేం రిచ్ కూడా కాదు" అని చెప్పారు.

"నేను ఇప్పుడు సీరియస్ గా మంచి చిత్రాలు చేస్తున్నా. కంటెంట్ ఉంటే అంతా ఆదరిస్తారని నమ్ముతా. జెన్యూన్ కంటెంట్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది. సపోర్ట్ కూడా వస్తుంది. అందుకే నా బ్యానర్ పై ఏడాదిలో మూడు సినిమాలు తీస్తానుకుంటున్నా. తర్వాత మూడేళ్లలో నార్మల్ ఫైనాన్షియల్ స్టేజ్ కు వస్తానని నమ్ముతున్నా" అని చెప్పారు.

కాగా, మార్గన్ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఆ సినిమాతోనే విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్‌ విలన్‌ గా పరిచయం అవుతున్నారు. సముద్రఖని, మహానటి శంకర్, ప్రతీక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖా, కలక్క పోవదు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.