Begin typing your search above and press return to search.

నిజంగా 200 కోట్లు వచ్చాయా?

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రూ.200 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకున్నట్లుగా టీం ప్రకటించింది.

By:  Tupaki Desk   |   18 April 2025 7:30 PM
Good Bad Ugly Ajith box office
X

తమిళ టాప్ స్టార్లు విజయ్, అజిత్ సినిమాలు రిలీజయ్యాయంటే చాలు తమిళ బాక్సాఫీస్ దగ్గర సందడి మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో కూడా ఆ హీరోల అభిమానులు కూడా బాగానే హడావుడి చేస్తారు. ఐతే ఈ స్టార్లిద్దరూ ఎక్కువగా చేసేవి రొటీన్ మాస్ మసాలా సినిమాలే. అభిమానులను, మాస్‌ను దృష్టిలో ఉంచుకుని చేసే విజయ్, అజిత్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వస్తుంటాయి.

కానీ లాంగ్ రన్ కష్టమే. కలెక్షన్ల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో తెగ హోరెత్తించేస్తుంటారు. కానీ ఆ వసూళ్లలో వాస్తవమెంత అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీక్ కంటెంట్‌తో వందల కోట్ల వసూళ్ల ఫిగర్లేంటో అర్థం కావు. విజయ్ నటించిన ‘లియో’ లాంటి ఫ్లాప్ మూవీకి కూడా 400 కోట్ల పోస్టర్ పడిపోయింది. ఇప్పుడు అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విషయంలోనూ కలెక్షన్ల ఫిగర్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రూ.200 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకున్నట్లుగా టీం ప్రకటించింది. కానీ వాస్తవ వసూళ్లు అంత లేవని అంటున్నారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏమీ పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపిన సినిమా కాదు. తెలుగులో అయితే ఈ చిత్రం వాషౌట్ అయిపోయింది. వచ్చిన వసూళ్లు రిలీజ్ ఖర్చులకు సరిపోయాయి. తమిళంలో కూడా ఈ సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. అజిత్ ఫ్యాన్స్‌కు మాత్రమే అది నచ్చింది

ఓపెనింగ్ వీకెండ్లో వసూళ్లు బాగానే వచ్చాయి కానీ.. ఆ తర్వాత సినిమా డౌన్ అయింది. అయినా రెండొందల కోట్ల వసూళ్లు ఎలా వచ్చాయన్నది అర్థం కాని విషయం. ఇందులో ఓవర్సీస్ వసూళ్లు మాత్రమే వంద కోట్లంటున్నారు. అజిత్‌ సినిమాకు వారం లోపే విదేశాల నుంచి రూ.100 కోట్ల వసూళ్లు రావడం అన్నది నమ్మశక్యంగా అనిపించని విషయం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పోస్టర్ల మీద మాత్రమే బ్లాక్ బస్టర్ అని.. వాస్తవ వసూళ్లను బట్టి చూస్తే ఇది యావరేజ్ అని అంటున్నారు.