సల్మాన్, అక్షయ్‌లని వెనక్కి నెట్టిన దళపతి!
హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఈ సినిమా తరువాత రాజకీయాలకే పరిమితం కాబోతున్నాడు.
By: Tupaki Desk | 18 May 2025 7:00 AM ISTపదేళ్ల క్రితం ఓ హీరో వంద కోట్ల క్లబ్‌లో చేరడం అంటే మామూలు విషయం కాదు. ఆ నెంబర్ గురించి ఆలోచించే వారే కాదు. కానీ `బాహుబలి` తరువాత సినిమాల బిజినెస్‌కు సంబంధించిన గేమ్ మొత్తం మారిపోయింది. బిజినెస్‌ని కొత్త కోణంలో చూడటం మొదలు పెట్టారు. లెక్కలూ మారిపోయాయి. ఇప్పడు టాప్ స్టార్ల సినిమా హిట్ అంటే రూ.500 కోట్లు లేదా రూ.కోట్లు అనే ట్రెండ్ మొదలైంది.
దీంతో స్టార్ హీరో సినిమా వంద కోట్లు రాబట్టడం అన్నది చాలా సర్వసాధరణగా మారింది. ఇప్పుడు రూ.200 కోట్లు రాబడితేనే గొప్పగా భావిస్తున్నారు. గత పదేళ్లలో `బాహుబలి`ని మినహాయించి రూ.200 కోట్లు రాబట్టిన సినిమాలు తక్కువే. చాలా వరకు స్టార్లు ఈ మొత్తాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు కూడా. కానీ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మాత్రం ఎనిమిది సార్లు ఈ ఫీట్‌ని సాధించిన హీరోగా నిలిచి ఆశ్చర్యపరిచాడు.
బాలీవుడ్ హీరోలు సల్మాన్‌ఖాన్, అక్షయ్ కుమార్‌లకు సాధ్యం కానీ ఫీట్‌ని దక్కించుకుని వారిని రేసులో వెనక్కి నెట్టడం విశేషం. 2017లో విజయ్, అట్లీల కాంబినేషన్‌లో వచ్చిన `మెర్సల్` మూవీ రూ. 200 కోట్ల మార్కుని దాటి వసూళ్లని రాబట్టింది. అదే తరహాలో సర్కార్, బిగిల్, మాస్తర్, బీస్ట్, వారీసు, లియో చిత్రాలు కూడా 200 కోట్లకు మించి వసూళ్లని దక్కించుకని విజయ్ సత్తా ఏంటో నిరూపించాయి.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో లోకేష్ సినిమాఇక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ.600 కోట్లకు మించి వసూళ్లని సొంతం చేసుకుంది. ఇక వెంకట్ ప్రభుతో చేసిన `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` రూ.400 కోట్లకు పైనే రాబట్టింది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్నభారీ పాన్ ఇండియా మూవీ `జన నాయగన్`. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఈ సినిమా తరువాత రాజకీయాలకే పరిమితం కాబోతున్నాడు.
రాజకీయపార్టీని ఇటీవలే ప్రకటించి వచ్చే తమిళనాడు ఎన్నికల కోసం సిద్ధం అఉవతున్నాడు. దీంతో `జన నాయగన్`పై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పూజా హెగ్డే, శృతిహాసన్, ప్రియమణి, బాబీ డియోల్, `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు, వరలక్ష్మీ శరత్‌కుమార్, నరేన్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీపై ఉన్న క్రేజ్‌తో నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు గానూ అమెజాన్ ప్రైమ్ రూ.121 కోట్లకు దక్కించుకోగా, శాటిలైట్ హక్కుల్ని సన్ టీవీ రూ.68 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే థియేట్రికల్ బిజినెస్‌కు ముందే `జన నాయగన్` రూ189 కోట్లని దక్కించుకోవడం విశేషం.
