Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : నయన్‌ కొడుకులు 'బాహుబలి' ఫోజ్‌

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంతకు ముందు వివాదాలతో, ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా వార్తల్లో ఉండేది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 4:47 AM GMT
పిక్ టాక్ : నయన్‌ కొడుకులు బాహుబలి ఫోజ్‌
X

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంతకు ముందు వివాదాలతో, ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా వార్తల్లో ఉండేది. ఆ తర్వాత సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం ద్వారా వరుసగా సినిమాలు చేస్తూ వార్తల్లో ఉండేది. ఈ మధ్య సినిమాల కంటే తన కవల కొడుకుల వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి రెగ్యులర్‌ గా టూర్స్ అంటూ, విహార యాత్రలు అంటూ వెళ్లే నయనతార తన పిల్లల ఫోటోలను రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో వీరి హడావుడి ఎక్కువ అయ్యింది.

విఘ్నేష్ శివన్‌ తాజాగా తన పిల్లలతో ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం జరిగింది. అయితే ఈసారి ఫాదర్స్ డే సందర్భంగా తన ఇద్దరు కొడుకులను బాహుబలి ఐకానిక్ ఫోజ్‌ లో ఎత్తుకుని నీటిలో తాని మునిగి ఉన్నాడు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. రెండు చేతులతో పిల్లలను విఘ్నేష్ నీటిలో మునిగి ఉన్న ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫాదర్స్ డే సందర్భంగా ఇలాంటి ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసిన విఘ్నేష్ శివన్‌ ని చాలా మంది అభినందిస్తున్నారు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా విఘ్నేష్ శివన్‌ తన భార్య నయనతార మరియు పిల్లలకు కావాల్సినంత సమయం ఇస్తాడు అనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నట్లుగా సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మీ ఫ్యామిలీ ఎప్పటికి ఇంతే సంతోషంగా ఉండాలని, మీ పిల్లలు మీరు కలిసి ఉండాలంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ అందమైన ఫోటోలు షేర్‌ చేయడంతో పాటు నా ఇద్దరు బాహుబలులు అంటూ విఘ్నేష్ కామెంట్‌ పెట్టాడు.