Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : అత్తమ్మతో నెంబర్ 1 హీరోయిన్ మొగుడు..!

కోలీవుడ్ క్రేజీ కపుల్ నయనతార విఘ్నేష్ శివన్ ల లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్న వారి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు

By:  Tupaki Desk   |   15 Sept 2023 12:01 PM IST
ఫోటో స్టోరీ : అత్తమ్మతో నెంబర్ 1 హీరోయిన్ మొగుడు..!
X

కోలీవుడ్ క్రేజీ కపుల్ నయనతార విఘ్నేష్ శివన్ ల లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్న వారి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. నయన్, విఘ్నేష్ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వారికి పుట్టిన ట్విన్స్ తో జీవితాన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ గా విఘ్నేష్, హీరోయిన్ గా నయనతార కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా ఇద్దరు వారికంటూ ఒక టైం కేటాయించుకుంటారు. నయన్ మీద ఎప్పటికప్పుడు తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు విఘ్నేష్.


లేటెస్ట్ గా విఘ్నేష్ తన ఇన్ స్టా ఖాతాలో నయనతార మదర్ ఒమ్నా కురియన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రేమ ఆశీస్సుల వల్లే మేము ఇలా సంతోషంగా ఉన్నామని కామెంట్ పెట్టారు. నయనతార తన మదర్ తో ఉన్న ఫోటోలతో పాటుగా వాళ్లిద్దరితో విఘ్నేష్ ఉన్న ఫోటోని కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. లేడీ సూపర్ స్టార్ క్రేజ్ తో నయనతార తను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ ని అంచనాలకు తగ్గకుండా చూసుకుంటుంది.

నయనతార పెళ్లి విషయంపై మీడియా చేసిన హంగామా తెలిసిందే. పెళ్లికి ముందే విఘ్నేష్, నయన్ కలిసి ఉన్నారు. ఒకరి మీద ఒకరు అభిమానం ప్రేమతో కొన్నాళ్లు అలా సహజీవనం చేశాక పెళ్లితో ఒకటయ్యారు. డైరెక్టర్ గా విఘ్నేష్ ప్రెజర్ ను నయన్.. హీరోయిన్ గా ఆమె పరిస్థితులను విఘ్నేష్ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ తమ లైఫ్ ని సంతోషకరంగా సాగిస్తున్నారు.

నయనతార ఈ మధ్యనే జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. సౌత్ లో ఇప్పటికే టాప్ లో ఉన్న నయనతార కెరీర్ లో ఫస్ట్ టైం హిందీ సినిమా చేసింది. ఆ సినిమా కూడా భారీ సక్సెస్ అవడంతో నయన్ కు అక్కడ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ తమిళంలో నయన్ రెండు సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం సినిమాకు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార తన సినిమాలతో స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తుంది. కోలీవుడ్ లో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న నయనతార రాబోయే సినిమాలతో కూడా సత్తా చాటాలని చూస్తుంది. తమిళం తో పాటుగా ఇప్పుడు హిందీ అవకాశాలు కూడా వస్తే అక్కడ కూడా బిజీ అవ్వాలని చూస్తుంది నయనతార.