హాలీవుడ్‌కి టాప్ ఇండియన్ యాక్షన్ హీరో
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కి సౌత్ లోను భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. జమ్వాల్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం, తీరైన శరీరాకృతితో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు.
By: Tupaki Desk | 21 July 2025 9:52 AM ISTబాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కి సౌత్ లోను భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. జమ్వాల్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం, తీరైన శరీరాకృతితో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు హాలీవుడ్ లో అడుగుపెడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ప్రఖ్యాత ఫ్రాంఛైజీ చిత్రం `స్ట్రీట్ ఫైటర్ 6`లో అతడు దలిల్ అనే పాత్రలో నటిస్తాడు. నిజానికి జపాన్ లో మొదలైన ఒక వీడియో గేమ్ కాన్సెప్ట్ నచ్చి హాలీవుడ్ లో స్ట్రీట్ ఫైటర్ సిరీస్ సినిమాలు మొదలయ్యాయి. 90ల కాలం నుంచి దశాబ్ధాల పాటు అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఫ్రాంఛైజీలో ఐదు సినిమాలు తెరకెక్కాయి. ఇవన్నీ వీడియో గేమ్ కాన్సెప్టుతో రూపొంది అభిమానులను అలరించాయి. ఇప్పుడు ఫ్రాంఛైజీ ఆరో చిత్రంలో ఒక భారతీయ యాక్షన హీరో నటిస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది.
బ్యాడ్ ట్రిప్, ఆర్డ్‌వార్క్ చిత్రాల ఫేం కితావో సకురాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఆగస్టులో ఆస్ట్రేలియాలో చిత్రీకరణ ప్రారంభించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో టాప్ హాలీవుడ్ స్టార్లు నటించనున్నారు. అయితే జమ్వాల్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అతడు భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తేగల ప్రతిభావంతుడు. విద్యుత్ జమ్వాల్ బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం తుప్పాక్కి (తుపాకి తెలుగులో) లో నటించిన సంగతి తెలిసిందే. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో అతడు విలన్ పాత్రలు పోషించాడు.
