Begin typing your search above and press return to search.

మరో హిందీ చంద్రముఖి.. రంగంలోకి మొదటి దెయ్యం

భూల్ భులయ్యా మేకర్స్.. ఫస్ట్ పార్ట్ లో నటించిన విద్యాబాలన్ ను మళ్లీ మూడో భాగానికి తీసుకున్నారు. ఈ విషయాన్ని నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 7:30 AM GMT
మరో హిందీ చంద్రముఖి.. రంగంలోకి మొదటి దెయ్యం
X

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి. ఈ సినిమా హారర్‌ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్‌ సెట్ చేసింది. చంద్రముఖి చిత్రంలో రజనీ మేనరిజం స్టైల్ తోపాటు జ్యోతిక నట విశ్వరూపం సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ చేసింది. గతేడాది ఈ మూవీ సీక్వెల్ గా చంద్రముఖి-2 తెరకెక్కింది. సీక్వెల్ లో నటించడానికి రజనీ ఆసక్తి చూపించకపోవడంతో ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించారు. జ్యోతిక బదులు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించింది.

తెలుగు, తమిళంలో మొదట ఈ సినిమాను తెరకెక్కించిన వాసునే సీక్వెల్ కు దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్ లో రిలీజైన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్లు. చూసిన సీన్సే మళ్లీ మళ్లీ చూసినట్లు ఉందని కామెంట్లు పెట్టారు. ఇక కంగన కూడా చంద్రముఖి రోల్ కు అస్సలు సెట్ కాలేదని అన్నారు. అయితే ఈ చంద్రముఖి సిరీస్ బాలీవుడ్ లోనూ తెరకెక్కిన విషయం తెలిసిందే.

బీటౌన్ లో భూల్ భులయ్యా పేరుతో ఫస్ట్ పార్ట్ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, విద్యాబాలన్ తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ లో విద్యాబాలన్ బదులు టబు, అక్షయ్ కుమార్ బదులు కార్తీక్ ఆర్యన్ నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు బాలీవుడ్ చంద్రముఖి మూడో పార్ట్ మొదలైంది.

భూల్ భులయ్యా మేకర్స్.. ఫస్ట్ పార్ట్ లో నటించిన విద్యాబాలన్ ను మళ్లీ మూడో భాగానికి తీసుకున్నారు. ఈ విషయాన్ని నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రకటించారు. షూటింగ్ కూడా మొదలైనట్లు చెప్పారు. దీపావళికి ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. అయితే బాలీవుడ్ మేకర్స్.. చంద్రముఖి సీక్వెల్స్ లో ఎక్కడా వాసు స్టోరీని తీసుకోకుండా కొత్త కథలు రాసుకుని తెరకెక్కిస్తుండడం గమనార్హం.

ఈ మూడో పార్ట్ లో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా హీరోయిన్ కియారా అద్వానీనే కొనసాగుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. నీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఎల్నాజ్ నొరౌజీ, నసీరుద్దీన్ షా, సారా అలీ ఖాన్ , రాజ్‌పాల్ యాదవ్, బోమన్ ఇరానీ తదితరులు నటించనున్నారు. మరి భూల్ భులయ్యా 3లో ముంజులికగా విద్యాబాలన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.