Begin typing your search above and press return to search.

వ్యాయామం లేకుండానే వెయిట్ త‌గ్గిన న‌టి!

తాజాగా విద్యా బాల‌న్ కూడా అధిక బ‌రువుతో తానెంత బాధ‌ప‌డింద‌న్న విష‌యాన్ని రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   9 July 2025 6:00 AM IST
వ్యాయామం లేకుండానే వెయిట్ త‌గ్గిన న‌టి!
X

సెల‌బ్రిటీలు ఫిట్ నెస్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఫిట్ నెస్...రూపాన్ని కోల్పోతే సినిమాల‌తో మెప్పించే ప‌రిస్థితి ఉండ‌దు. ఈ విష‌యంలో సెల‌బ్రిటీలంతా జాగ్ర‌త్త‌గా మ‌రొక‌రు ఉండ‌ర‌న్న‌ది అతి శ‌యోక్తి కాదు. ఇలా ఎంత చేసినా ఒక్కోసారి అనుకోని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. అయినా ఆ ప‌రిస్థి తుల్లోకి పూర్తి గా వెళ్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. మ‌హమ్మారి క్యాన్స‌ర్ నే జ‌యించిన సెల‌బ్రి టీలు ఎంతో మంది. ఈ విష‌యంలో సెల‌బ్రిటీలు ఎంతో మందికి ఇన్ స్పేరేష‌న్ అని చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో మ‌హ‌మ్మారి నుంచి బ‌యడ ప‌డిన సెల‌బ్రిటీలు క్యాన్స‌ర్ పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంటారు. ఎన్ జీవోల‌తో క‌ల‌సి స‌మాజంలో త‌మ వంతు బాధ్య‌త‌గా ప‌ని చేస్తుంటారు. తాజాగా విద్యా బాల‌న్ కూడా అధిక బ‌రువుతో తానెంత బాధ‌ప‌డింద‌న్న విష‌యాన్ని రివీల్ చేసింది. అది బ‌రువు కాదు.. అధిక వాపు తో తీవ్ర‌మైన అనారోగ్య బారి నుంచి తానెలా బ‌య‌డ పడింద‌న్న‌ది న‌లుగురుకి షేర్ చేసింది.

`కెరీర్ ఆరంభం నుంచే అధిక బ‌రువుతో ఉండేదాన్ని. ఈ క్ర‌మంలో చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కున్నా. స‌న్న బ‌ట‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసా. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయింద‌ని చేయాల్సిన‌వ‌న్నీ చేసా. కానీ ఏం లాభం లేదు. కానీ జిమ్ కు వెళ్ల‌డం మానేసిన త‌ర్వాత బ‌రువు త‌గ్గాను. నా శ‌రీరంలో ఉంది బ‌రువు కాదు. వాపు అని గుర్తించా. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఈ ఏడాది మొదట్లో చెన్నైకి చెందిన `అముర' అనే న్యూట్రిషనల్ గ్రూప్‌ను సంప్ర‌దించాను. తను శరీరంలో పేరుకుపోయింది కొవ్వు కాదని, అది కేవలం ఇన్ఫ్లమేషన్( అంటే శ‌రీరంలో ఉండే ఒక‌ర‌క‌మైన వాపు) అని తెలిపారు.

వారు నాకోసం ఇన్ఫ్లమేషన్‌ను తొలగించే ప్రత్యేకమైన డైట్‌ను సూచిం చారు. అది నాకు మంచి ఫ‌లితా న్నిచ్చింది. చాలా వ‌ర‌కూ బ‌రువు త‌గ్గిపోయాను. అధిక భారం శ‌రీరానికి చాలా అసౌక‌ర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు ఎంతో విశాలంగా అనిపిస్తుంది. స్నేహితులంతా స్లిమ్ గా ఉన్నావ్ అంటున్నారు. శ‌రీర‌మంతా ఎంతో తేలికగా ఉంది. కానీ ఆ డైట్ మొద‌లు పెట్టిన త‌ర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయ‌కూడ‌దు అనే కండీష‌న్ మ‌ర్చిపోకూడ‌దు. ఆ డైట్ కి-వ్యాయామానికి సెట్ కాదు. దీంతో జిమ్ మానేసి ఇంట్లో తింటూనే బ‌రువు త‌గ్గాను` అని తెలిపింది.