ఇక్కడ రిజెక్ట్ చేశారని ఆగిపోలేదు..
బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో విద్యా బాలన్ కూడా ఒకరు.
By: Tupaki Desk | 11 July 2025 10:49 AM ISTబాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో విద్యా బాలన్ కూడా ఒకరు. ఆమె రీసెంట్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ స్టార్టింగ్ లో సౌత్ సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో తాను చేయాల్సిన చక్రం సినిమా పర్మినెంట్ గా ఆగిపోవడంతో అందరూ తనను అపశకునంగా భావించారని ఆమె తెలిపారు.
దాని వల్ల రాత్రికి రాత్రే ఆమె తొమ్మిది సినిమాలను ఎలా కోల్పోయారో కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా తనపై అన్యాయంగా అపశకునం అని వేసిన ముద్ర తనకు తీవ్ర గాయాన్ని మిగిల్చిందని, కానీ ఎలాగైనా సినిమాలు చేసి సక్సెస్ అవాలనే దృఢ సంకల్పం వల్ల తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఆ దృఢ సంకల్పమే తనను ఇండియన్ సినిమాలో ఓ గొప్ప రూట్ ను ఏర్పరచుకోవడానికి ఉపయోగపడిందని ఆమె వెల్లడించారు.
మొదటిగా విద్యా బాలన్ తన యాక్టింగ్ కెరీర్ ను సౌత్ లో మొదలుపెట్టారు. అప్పటివరకు తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన విద్యా బాలన్ సైన్ చేసిన చక్రం సినిమా అనుకోకుండా ఆగిపోవడంతో సౌత్ ఇండస్ట్రీ ఆ నిందను ఆమెపై వేసి నిందించడంతో క్రమంగా విద్యాకు సౌత్ లో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. విద్యాకు టాలెంట్ ఉన్నప్పటికీ ఆమె ప్రాజెక్టులోకి వస్తే ఆ దురదృష్టం తమకెక్కడ వస్తుందోననే భయంతో ఫిల్మ్ మేకర్స్ ఆమెను తీసుకోవడానికి వెనుకడుగేశారు.
అయినా సరే విద్యా బాలన్ వెనుకడుగేయలేదు. ఆ ఎదురుదెబ్బను తట్టుకుని తన ఫోకస్ ను బాలీవుడ్ వైపు మళ్లించారు. 2005లో పరిణీత అనే సినిమాతో బాలవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విద్యా బాలన్, ఆ సినిమాతో ఎన్నో గొప్ప ప్రశంసలు అందుకున్నారు. దాని తర్వాత కహానీ, తుమ్హారీ సులు, శకుంతలా దేవి లాంటి సినిమాల్లో ఎంతో పవర్‌ఫుర్ నటనతో నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ ఇండస్ట్రీ మొత్తం తనకు నో చెప్పినా బాలీవుడ్ కు వెళ్లి నటిగా తానేంటే ప్రూవ్ చేసుకుని టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే ఎప్పటికైనా కెరీర్ లో రాణిస్తారని తెలిపారు.
