ఎన్టీఆర్ - నీల్ మూవీలో పవర్‌ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్
ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ మూవీలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా కనిపించబోతుందట.
By: Tupaki Desk | 20 May 2025 11:00 PM ISTదేవర తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా డ్రాగన్. ఇది కాకుండా ఎన్టీఆర్ బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా చేశాడు. కానీ అది బాలీవుడ్ సినిమా కావడంతో పాటూ వార్2 లో కేవలం ఎన్టీఆర్ ఒక్కడే హీరో కాకపోవడంతో అందరి దృష్టి డ్రాగన్ పైనే ఉంది. ఈ సినిమాకు కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తుండగా, డ్రాగన్ నుంచి ఏ వార్త బయటికొచ్చినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ మూవీలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా కనిపించబోతుందట.
ఎన్టీఆర్ నీల్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని, అందులో ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది. నీల్ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ఎంతో పవర్‌ఫుల్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఈ సినిమాలో నటిస్తుందని తెలియడంతో ఈ సినిమాపై అందరికీ అంచనాలు భారీగా పెరిగాయి.
మరి నీల్ విద్యా బాలన్ క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేశాడో చూడాలి. ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా తీర్చి దిద్దాలని నీల్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ పై నీల్ చాలా కాలం పాటూ వర్క్ చేశాడు. ఇప్పటివరకు నీల్ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లో ఇదే బెస్ట్ గా నిలవనుందని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
మొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో నీల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఆడియన్స్ ఎవరూ ఊహించని స్థాయిలో ఈ మూవీ ఉంటుందని, ఎన్టీఆర్ పై ఇష్టం, అభిమానంతో ఈ సినిమా చేస్తున్నానని తెలిపాడు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. వచ్చే ఏడాది జూన్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
