అవమానంతో అద్దానికి దూరంగా ఆరు నెలలు!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ కాస్టింగ్ కౌచ్ పై గతంలో ఎంతో ఓపెన్ గా మాట్లాడింది.
By: Tupaki Desk | 21 April 2025 11:00 PM ISTబాలీవుడ్ నటి విద్యాబాలన్ కాస్టింగ్ కౌచ్ పై గతంలో ఎంతో ఓపెన్ గా మాట్లాడింది. ఇండస్ట్రీలో అవకాశం పేరుతో లైంగికంగా ఎలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది చెప్పిన సందర్భాలెన్నో. లైంగిక వేధింపుల నుంచి తానెలా తప్పించుకుందో చెప్పింది. అలాంటి వాళ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహ రించాలన్నది కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే యువతకు సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కాస్టింగ్ కౌచ్ పై గళం విప్పింది.
`ఓ సినిమా నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు. నేరుగా నా దగ్గరకు వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత ఆరు నెలలు పాటు అద్దంలో ముఖం చూసుకోవడం మానేసాను. ఆ మాటల తర్వాత నాపై నేను నమ్మకం కూడా కోల్పోయాను. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అదే సమయంలో బాడీ షేమింగ్ చేసేవారు. మలయాళంలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోయింది.
అప్పుడు నన్నతంతా దురదృష్టవంతురాలన్నారు. సినిమా ఏదో కారణంతో ఆగిపోతే అంతా నన్నే ఆడిపో సుకున్నారు. నా కారణంగా నిలిచిపోయిందన్నట్లు ప్రచారం చేసారు. ఇలాంటివి నా జీవితంలో చాలా ఉన్నాయని` వాపోయింది. బాలీవుడ్ పై కాస్టింగ్ కౌచ్ అరోపణలు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పరిశ్రమపై ఆరోపణలు చేసారు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే నుంచి చాలా మంది యువ భామలు తమ అనుభవాల్ని చెప్పుకొచ్చారు.
విద్యాబాలన్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి నెలలు గడుస్తుంది. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ కొత్త ఏడాది లో మాత్రం `డర్టీ భామ` ఒక్క అనౌన్స్ మెంట్ కూడా చేయలేదు.
