Begin typing your search above and press return to search.

విలక్షణ దర్శకుడి ప్లాన్‌ అదుర్స్‌

తమిళ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌ గత ఏడాది 'విడుదల' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:48 AM GMT
విలక్షణ దర్శకుడి ప్లాన్‌ అదుర్స్‌
X

తమిళ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌ గత ఏడాది 'విడుదల' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అప్పటి నుంచి కూడా ఆయన అభిమానులు మరియు సినీ ప్రేమికులు 'విడుదల 2' కోసం వెయిట్‌ చేస్తున్నారు. నక్సలైట్ డ్రామాగా రూపొందిన విడుదల మొదటి పార్ట్‌ లో విజయ్‌ సేతుపతి కొద్ది సమయం మాత్రమే కనిపించాడు.

విడుదల పార్ట్‌ 2 లో విజయ్ సేతుపతి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరో రెండు లేదా మూడు నెలల్లో సినిమా యొక్క షూటింగ్‌ ను ముగించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. ఇంకా షూటింగ్‌ పూర్తి అవ్వకుండానే ఈ సినిమాను నెదర్లాండ్స్ లో జరిగిన రాటెన్‌ డాం ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించి అందరిని సర్‌ ప్రైజ్ చేశారు.

ఇప్పటి వరకు పూర్తి అయిన సన్నివేశాలను మొదటి పార్ట్‌ కి జత చేసి వెట్రిమారన్ 'విడుదల' ను అక్కడి ఫిలిం ఫెస్టివల్‌ లో ప్రదర్శించారని తెలుస్తోంది. రెండు పార్ట్‌ లను కలిపి స్క్రీనింగ్‌ చేయాలనే ఆలోచనకు అంతా కూడా వావ్ అదుర్స్‌ అంటూ కితాబిస్తున్నారు. విడుదల 2 కి మంచి పబ్లిసిటీ అన్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫిల్మ్‌ ఫెస్టివల్ లో సినిమా స్క్రీనింగ్‌ పూర్తి అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చిందట. ప్రేక్షకులు అంతా కూడా లేచి చిత్ర యూనిట్‌ సభ్యులను చప్పట్లు కొడుతూ అభినందించారని తమిళ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో దర్శకుడు వెట్రిమారన్‌ తో పాటు విజయ్‌ సేతుపతి మరియు సూరి ఇంకా ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. విడుదల 2 తర్వాత వెట్రిమారన్ తమిళ స్టార్‌ హీరోతో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో ఒక టాలీవుడ్‌ స్టార్‌ తో కూడా వెట్రిమారన్‌ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. విడుదల 2 ఫలితం ఆధారంగా ఆయన తదుపరి సినిమాలు ఉండే అవకాశం ఉంది.