Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్ కారణంగా ఫార్మ్ హౌస్ కి షిఫ్ట్ అవుతున్న యువ హీరో...?
By: Tupaki Desk | 21 Jun 2020 2:00 PM ISTటాలీవుడ్ యువ హీరో నాగశౌర్య.. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కరోనా వైరస్ పాజిటివ్ అని తెలియడంతో కలవరపడుతున్నాడట. సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తేలితే నాగశౌర్య ఎందుకు కలవరపడటం అని ఆలోచిస్తున్నారా?. దీనికి కారణం బండ్ల గణేష్ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలోనే నాగశౌర్య ఫ్యామిలీ కూడా నివసించడమే. దీంతో తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం అయ్యారట శౌర్య. కేవలం అతని ఫ్యామిలీయే కాకుండా అక్కడ నివసించే ఇతర కుటుంబాలు కూడా కరోనా నిర్ధారిత పరీక్షలకు వెళ్తున్నట్లు సమాచారం. నిజానికి బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా కరోనా ఫ్రీ గా ఉన్న టాలీవుడ్ ఒక్కసారిగా ఈ వార్తతో కంగారు పడింది.
ఇదిలా ఉండగా నాగశౌర్య ఆ గేటెడ్ కమ్యూనిటీ నుండి సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. హైదరాబాద్ సిటీ ఔటస్కర్ట్స్ లో ఉన్న తన ఫార్మ్ హౌస్ కి తన ఫ్యామిలీతో కలిసి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. తాను నివసించే ప్రదేశంలోనే కరోనా కేసులు నమోదవడం మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగూ షూటింగ్స్ జరిగేలా కనిపించకపోవడంతో నాగశౌర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతగా అవసరం అయితే ఫోన్ కాల్ లేదా జూమ్ లో ప్రొడ్యూసర్స్ కి టచ్ లో ఉండొచ్చు అని ఆలోచిస్తున్నాడట. అందులోనూ శౌర్య కమిట్ అయిన ఏ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేసే ఆలోచనలో లేరట. దీంతో కొన్ని రోజులు ఆ ఫార్మ్హౌస్ లోనే నాగశౌర్య తన ఫ్యామిలీతో ఉండనున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే నాగశౌర్య ప్రస్తుతం మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. దీంతోపాటు మహేష్ కోనేరు నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా ఉండబోతోందని సమాచారం.