Begin typing your search above and press return to search.
మహేష్, బాలయ్య నటులు.. చెర్రీ, బన్నీ హీరోలు
By: Tupaki Desk | 16 July 2015 8:48 PM ISTప్రతీఏటా ఇస్తున్నట్లే ఈ ఏడు కూడా టి.సుబ్బిరామి రెడ్డి కళాపరిషత్ అవార్డులు ప్రకటించేశారు. అయితే గతేడాది అనివార్య కారణాల వలన అవార్డులు ఇవ్వలేదు. ఇక రెండేళ్ళకూ కలిపి ఒకేసారి అవార్డులను ప్రకటించేశారు సుబ్బిరామి రెడ్డి. 2013, 2014కు గానే వచ్చే ఆదివారం హైదారబాద్‌లో ఈ సినిమా అవార్డులు అందించనున్నారు.
అన్నింటిలోకి కళ్లు చెదిరిపోయే అవార్డులు ఎప్పుడైనా కూడా ఉత్తమ నటుడు, ఉత్తమ సపోర్టింగ్ నటుడు వంటి కేటగిరీలే. అయితే టాలీవుడ్‌లో దాదాపు పెద్ద మనుషులు అందరితోనూ సత్సంభందాలు కలిగిన వ్యక్తి సుబ్బిరామిరెడ్డి. అందుకే ఆయన బెస్ట్ యాక్టర్ అనే అవార్డును మూడు పేర్లతో ముగ్గురికి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2013 సంవత్సరానికి.. బెస్ట్ యాక్టర్ అవార్డు మహేష్ (సీతమ్మవాకిట్లో)కు ఇస్తే, బెస్ట్ హీరో అంటూ రామ్‌చరణ్ (నాయక్)కు మరో అవార్డు ఇస్తున్నారు. అలాగే 2014కు గాను బాలయ్య లెజండ్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డునిస్తే, బన్నీ రేసుగుర్రం పెర్‌ఫార్మెన్స్‌కు బెస్ట్ హీరో అవార్డు ఇస్తున్నారు. ఇక రెండేళ్లకూ కలిపి జ్యూరి స్పెషల్ ఉత్తమ నటులుగా నాగార్జున (మనం), దృశ్యం (వెంకటేష్)లను సెలక్ట్ చేశారు. ఇక టాలీవుడ్‌లో ఏ స్టార్ గ్యాంగ్‌ను వదిలేశారని.. అందరినీ ఖుషీ చేస్తున్నారు.
ఆగండి.. ఈ ఉత్తమ నటులు, సూపర్ నటులు ఇంకా ఉన్నారు.. జ్యూరి అవార్డుల్లో భాగంగా మంచు లక్ష్మి, ఛార్మి, స్నేహ ఉల్లాల్, తాప్సీ, త్రిష, అమలాపాల్, సంజన.. ఇలా అందరికీ అవార్డుల పంటే. అది సంగతి.