Begin typing your search above and press return to search.

సోనమ్ కోసం ఐశ్వర్యని తప్పించారు

By:  Tupaki Desk   |   15 March 2016 7:04 AM GMT
సోనమ్ కోసం ఐశ్వర్యని తప్పించారు
X
ఓ హీరోయిన్ పాపులారిటీ, రేంజ్ ని డిసైడ్ చేయడానికి.. ఆమె చేతిలో ఉండే బ్రాండ్ అండార్స్ మెంట్లను లెక్క పెట్టే రోజులువి. అలాంటిది ఓ స్టార్ చేసే యాడ్.. హఠాత్తుగా మరో హీరోయిన్ చేతికి వెళ్లిందంటే.. ఖచ్చితంగా డామినేషన్ మొదలైపోయిందని అనాల్సిందే. ఇప్పుడు ఓ యాడ్ కోసం మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ ని కాదని.. సోనమ్ కపూర్ చేతికి రావడం సెన్సేషన్ అవుతోంది.

కళ్యాణ్ జ్యూవెలర్స్ యాడ్ లో ఐశ్వర్యారాయ్ చాలా కాలంగా నటిస్తోంది. ఐష్ తో పాటు ఆమె మామగారు అమితాబ్ బచ్చన్, అత్తగారు జయా బచ్చన్ లు కూడా ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లే. అయితే.. అమితాబ్ - జయా బచ్చన్ లు కంటిన్యూ చేసిన ఈ సంస్థ.. ఐష్ ను మాత్రం తప్పించింది. ఆ ప్లేస్ లోకి సోనమ్ కపూర్ ను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పటికే సోనమ్ తో యాడ్ షూటింగ్ స్టార్ట్ చేసేయనున్నారు కూడా.

మూడేళ్ల పాటు కళ్యాణ్ జ్యూవెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది సోనమ్ కపూర్. మూడేళ్లపాటు తమకు ప్రచారం చేసిన ఐష్ కి థ్యాంక్స్ చెబుతూ.. కొత్తగా ఈ పాత్రలోకి వస్తున్న సోనమ్ కి వెల్కం చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. ఈ సోనా యాడ్ తో.. సోనమ్ డామినేషన్ స్టార్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది.