Begin typing your search above and press return to search.

దుర‌దృష్ట నాయిక‌గానే మిగిలిపోయింది!

By:  Tupaki Desk   |   5 Feb 2022 1:30 AM GMT
దుర‌దృష్ట నాయిక‌గానే మిగిలిపోయింది!
X
పాన్ ఇండియా లెవ‌ల్లో ఒక అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో నటించి ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా జీరో స్టేజ్ లోనే ఉండిపోతే ఏమ‌నాలి? ఆ క‌థానాయిక లేదా న‌టీన‌టుల‌కు ఏదీ క‌లిసి రాలేద‌ని దుర‌దృష్ట‌వంతులు అని అన‌డం స‌హ‌జం. ఇదే కేట‌గిరీకి చెందుతుంది కేజీఎఫ్ బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి. అందాల పోటీల్లో యువ‌రాణిగా వెలిగిపోయిన ఈ బ్యూటీ మోడ‌లింగ్ నుంచి నేరుగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.

ఆరంభ‌మే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ స‌ర‌స‌న కేజీఎఫ్ లాంటి సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా హిట్ లో న‌టించింది. ఈ సినిమా త‌ర్వాత శ్రీ‌నిధి కెరీర్ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా సాగుతుంద‌ని అంతా భావించారు. కానీ దుర‌దృష్ట‌నాయిక‌గానే మిగిలిపోయింది! కేజీఎఫ్ త‌ర్వాత సీక్వెల్ కేజీఎఫ్ 2లోనూ న‌టిస్తోంది. కానీ ఏం ఉప‌యోగం? ఆ త‌ర్వాత భారీ ఆఫ‌ర్లు ఏవీ క్యూ క‌ట్ట‌నే లేదు. ఇటు తెలుగు-త‌మిళం నుంచి శ్రీ‌నిధి న‌టించే సినిమాలేవీ క‌నిపించ‌డం లేదు.

శ్రీనిధి శెట్టి కంటే వెన‌క రంగ ప్ర‌వేశం చేసిన చాలా మంది క‌న్న‌డ హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ర‌ష్మిక మంద‌న లాంటి నాయిక సౌత్ అగ్ర క‌థానాయిక‌గా వెలిగిపోతూ బాలీవుడ్ లోనూ స‌త్తా చాటుతోంది. మ‌రోవైపు ఉప్పెన చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన కృతి శెట్టి వ‌రుసగా క్రేజీ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది. కానీ అందాల పోటీల యువ‌రాణిగా వెలిగిపోయిన శ్రీ‌నిధి శెట్టి కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. క‌న్న‌డ‌లో ఆఫ‌ర్లు వ‌చ్చినా కానీ తెలుగు-త‌మిళంలో త‌న తొలి అడుగుల్ని విజ‌య‌వంతంగా వేయ‌లేక‌పోతోంది. ఇక్క‌డ క్రేజీ స్టార్ల నుంచి ఆఫ‌ర్లు ఏవీ త‌న‌ని వ‌రించ‌డం లేదు.

ఒక‌ర‌కంగా ఇది దుర‌దృష్టం అనే అనాలి. ఆరంభ‌మే పాన్ ఇండియా సినిమా నాయిక‌గా వెలిగిపోయిన శ్రీ‌నిధి శెట్టిలో అందానికి అందం హాట్ కంటెంట్ ఉన్నా కానీ ఎందుక‌నో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క‌న్ను ప‌డ‌లేదు.

క‌నీసం ఇప్పుడు భారీ అంచనాల న‌డుమ విడుద‌ల‌వుతున‌న కేజీఎఫ్ 2 త‌ర్వాత అయినా సీన్ మారుతుందేమో చూడాలి. ఆలస్యమైన ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ని పూర్తి చేసినట్టు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలిపింది. త‌న‌ ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.