Begin typing your search above and press return to search.

తెలుగులో అమ్మడికి అదే ఆఖ‌రి అవ‌కాశం..!

By:  Tupaki Desk   |   10 May 2021 4:30 PM GMT
తెలుగులో అమ్మడికి అదే ఆఖ‌రి అవ‌కాశం..!
X
దక్షిణాది అగ్ర కథానాయికగా వెలుగొందిన రకుల్‌ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు తెలుగులో హవా తగ్గిపోయింది. 'స్పైడర్' 'మన్మథుడు 2' సినిమాల పరాజయం తర్వాత టాలీవుడ్ కు దూరమైన రకుల్.. ఇటీవల 'చెక్' మూవీతో పలకరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఇప్పుడు అమ్మడు క్రిష్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గర్ల్ గా డీ గ్లామ‌ర్ రోల్ పోషిస్తోంది. తెలుగులో ఈ బ్యూటీకిదే ఆఖ‌రి అవ‌కాశం అనుకోవాలి.

కాకపోతే ఇది ఈ బ్యూటీని మాస్ ఆడియెన్స్ కి ద‌గ్గ‌ర చేసే టైప్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు తెలుగులో ఎలాగూ అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి త‌న సీనియ‌ర్స్ మాదిరిగా ఏదైనా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్లు స్టార్ట్ చేస్తే మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సినీ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రెజీనా కసండ్రా - తాప్సీ పొన్ను - ప్రియ‌మ‌ణి వంటి హీరోయిన్లు అలాంటి రోల్స్ లో నటిస్తూ అదరగొడుతున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఆ దిశగా ఆలోచిస్తుందేమో చూడాలి.

తెలుగులో రకుల్ కు అవకాశాలు సన్నగిల్లినా ఇతర భాషల్లో మాత్రం సత్తా చాటుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న 'ఎటాక్' సినిమా నటిస్తోంది. అలానే అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మే డే' సినిమాలలో రకుల్ కీలక పాత్రలు పోషిస్తోంది. ఇక తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన 'అయలాన్' చిత్రంలోనూ రకుల్ నటించనుంది.