Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: డీకంపెనీ బ్యూటీ దిమ్మ‌తిరిగే ట్రీట్

By:  Tupaki Desk   |   26 March 2021 5:00 PM IST
ఫోటో స్టోరి: డీకంపెనీ బ్యూటీ దిమ్మ‌తిరిగే ట్రీట్
X
నైనా గంగూలీ .. ఇటీవ‌ల ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు. ఆర్జీవీ డిస్క‌వ‌రీగా సుప‌రిచిత‌మైన ఈ బ్యూటీ `వంగవీటి` సినిమాలో రత్నకుమారి పాత్ర‌లో ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. అదొక్క‌టే చివ‌రి ట్రెడిష‌నల్ రోల్. ఆ త‌ర్వాత ఆవిడ ఈవిడేనా? అనేంత‌గా చెల‌రేగి రొటీన్‌ కి భిన్నంగా గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో అగ్గి రాజేస్తోంది. చ‌రిత్ర‌హీన్ అనే వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ నాయిక‌గానూ నైనా కొన‌సాగుతోంది.

ఆర్జీవీ రూపొందించిన `బ్యూటిఫుల్` చిత్రంలో కాక‌లు పుట్టించే రేంజులో చెల‌రేగింది. ఆర్జీవీకే చెందిన డీకంపె‌నీ రూపొందించిన‌ `డేంజరస్` అనే మూవీలోనే లెస్బియన్ గా న‌టిస్తోంది. `జోహార్‌` అనే వేరొక మూవీలోనూ నాయిక‌.

అయితే ఇటీవ‌ల క్రైసిస్ వ‌ల్ల నైనా న‌టించిన సినిమాలేవీ రిలీజ్ కి రావ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే వ‌రుస ఫోటోషూట్లతో విరుచుకుప‌డుతోంది. ఇంత‌కుముందు సాటి నాయిక‌తో లెస్బియ‌న్ లిప్ లాక్ కి రెడీ అయ్యింది. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. తాజాగా కెరీర్ బెస్ట్ హాటెస్ట్ ఫోటోషూట్ తో మ‌రోసారి నైనా విరుచుకుప‌డింది. నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత‌గా చెల‌రేగి కొత్త‌‌ లుక్ తో అభిమానుల‌కు ఇన్ స్టా వేదిక‌గా ట్రీటిచ్చింది నైనా.

``న్యూ డే .. న్యూ షూట్! ఆర్జీవీ జూమిన్ టీమ్ కి థాంక్యూ.. నా లుక్ తో నేను ప్రేమ‌లో ప‌డ్డాను!!`` అంటూ వేడెక్కించే ఫోటోల‌కు త‌గ్గ‌ట్టే ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌ను జోడించింది. ప్ర‌స్తుతం యువ‌త‌రంలో నైనా ఫోటోలు అంత‌కంత‌కు హీట్ పెంచేస్తున్నాయి. అభిమానులు వీటిని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.