Begin typing your search above and press return to search.

శామ్ చైతూ సింఫుల్ పెళ్లి ఖ‌ర్చు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Oct 2017 9:30 AM GMT
శామ్ చైతూ సింఫుల్ పెళ్లి ఖ‌ర్చు ఎంతో తెలుసా?
X
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి వేడుక రోజుల్లోకి వ‌చ్చేసింది. నాగ చైత‌న్య.. స‌మంత‌ల పెళ్లి వేడుక ఈ శుక్ర‌వారం (అక్టోబ‌రు 6) గోవాలో జ‌ర‌గ‌నుంది. డ‌బ్ల్యూ రిసార్ట్స్ లో జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడుక కోసం నాగ్ ఫ్యామిలీ ఇప్ప‌టికే రిసార్ట్స్ కు చేరుకుంది. ఇవాల్టి (ఆదివారం) నుంచి పెళ్లి అయ్యే వ‌ర‌కు వారంతా అక్క‌డే ఉండ‌నున్నారు.

ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం అక్టోబ‌రు 6న హిందూ సంప్ర‌దాయంలో పెళ్లి జ‌రుగుతుండ‌గా.. అక్టోబ‌రు 7న క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి జ‌ర‌గ‌నుంది. త‌మ పెళ్లిని చాలా సింఫుల్ గా చేస్తున్న‌ట్లు ఈ జంట చెబుతున్న‌ప్ప‌టికీ.. ఈ పెళ్లి కోసం పెడుతున్న ఖ‌ర్చు ఏకంగా రూ.10 కోట్లుగా చెబుతున్నారు.

మ‌రి.. సింఫుల్ గా చేసుకునే పెళ్లికి అన్నేసి కోట్ల ఖ‌ర్చు ఎందుకంటే.. అస‌లు విష‌యం అక్క‌డే ఉంది మ‌రి. పెళ్లికి కేవ‌లం 150 మంది అతిధుల్ని పిలుస్తున్నారు.ఎంపిక చేసిన స‌న్నిహితుల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడ‌క‌కు వ‌చ్చే వారికి విమాన ఖ‌ర్చులు మొద‌లు అన్నీ ఖ‌ర్చులు చైతూ.. శామ్ లే భ‌రిస్తార‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే సింఫుల్ పెళ్లికి రూ.10 కోట్లు ఖ‌ర్చు అవుతున్నాయి.

పెళ్లికి హాజ‌ర‌య్యే 150 మందిలో ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం రాంచ‌ర‌ణ్ దంప‌తులు.. వెంక‌టేశ్‌.. రానా.. రాహుల్ ర‌వీంద్ర ఫ్యామిలీ.. మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు హాజ‌రు కానున్న‌ట్లు చెబుత‌న్నారు. ఈ నెలాఖ‌రులో భారీ ఎత్తున రిసెప్ష‌న్ ఇవ్వ‌నున్నారు.