Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : బిబి తెలుగు బ్యూటీ ఎక్స్‌ పోజింగ్ పీక్స్

By:  Tupaki Desk   |   17 Nov 2021 8:30 AM GMT
ఫొటోటాక్ : బిబి తెలుగు బ్యూటీ ఎక్స్‌ పోజింగ్ పీక్స్
X
తెలుగు హీరోయిన్స్ అంటే ఇండస్ట్రీలో కాస్త చిన్న చూపు ఉన్నది అనే విషయం ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఎంతో మంది అందెగత్తెలు ఉన్నా.. మంచి ప్రతిభావంతులు ఉన్నా కూడా స్టార్ ఫిల్మ్‌ మేకర్స్ అంతా కూడా ఇతర భాషకు చెందిన హీరోయిన్స్ నే ఆశ్రయిస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు చిన్నా చితకా ఆఫర్లు మాత్రమే వస్తున్నాయి.

తెలుగు అమ్మాయిలతో నటించడంకు స్టార్ హీరోలు ఆసక్తి చూపించక పోవడం కారణం ఏంటో కాని కొందరు మాత్రం తెలుగు అమ్మాయిలు అందాలు ఆరబోసేందుకు ఇష్టపడరు అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తూ ఉంటారు. కాని ఇప్పుడు వారు తమ అభిప్రాయంను వెనక్కు తీసుకోవాల్సిందే.

ఎందుకంటే తెలుగు అమ్మాయిలు పలువురు ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శణ చేస్తున్నారు. వల్గర్‌ గా కాకుండా అందంగా ఉత్తరాది ముద్దుగుమ్మల తరహాలో ఆకట్టుకునే రూపంతో ఫిజిక్‌ తో ఎక్స్‌ పోజింగ్‌ చేస్తున్నారు.

బిగ్‌ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ దివి. అంతకు ముందు వరకు ఈమె పెద్దగా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బిగ్‌ బాస్ లో ఈమెకు ఎంట్రీ దక్కిందో అదృష్టం కలిసి వచ్చింది. అనూహ్యంగా ఈమెకు బ్రేక్‌ దక్కింది.

మెగాస్టార్‌ చిరంజీవి వేదాళం రీమేక్ భోళా శంకర్‌ సినిమా లో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాలు కంటిన్యూగా చేస్తూ వస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటో షూట్‌ లు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ముంబయి ముద్దుగుమ్మలను ఏమాత్రం తీసి పోకుండా దివి పాప చేసిన ఎక్స్‌ పోజింగ్‌కు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

తాజాగా ఈ అమ్మడు సంతోష్‌ మరియు సుమన్ టీవీ నిర్వహించిన అవార్డు వేడుకలో పాల్గొన్నది. ఆ సందర్బంగా ఈమె చేసిన స్టేజ్ షో అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్ షో కోసం ఈ అమ్మడు ధరించిన కాస్ట్యూమ్స్ మరియు అమ్మడి ఎక్స్‌ పోజింగ్‌ హాట్‌ టాపిక్ అయ్యింది.

ఈ అమ్మడిని ఇలా చూస్తే ఏ స్టార్‌ హీరో అయినా తమ సినిమాలో అవకాశం ఇవ్వాలనుకుంటాడు అంటూ దివి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దివి పాప రోజు రోజుకు ఎక్స్ పోజింగ్‌ ను పెంచేస్తుంది. ఈసారి ఆమె ఎక్స్‌ పోజింగ్‌ పీక్స్ కు చేరిందంటూ అభిమానులు అంటున్నారు.

చిరంజీవి సినిమా భోళా శంకర్‌ లో ఈమె నటించిన తర్వాత ఫుల్‌ బిజీ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ముందు ముందు ఈ అమ్మడి నుండి మరెంతటి బోల్డ్‌ ఫొటో షూట్స్ ను చూడబోతున్నామో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.