Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సినిమాకు ప్ర‌ముఖ ఓటీటీల‌ క్రేజీ ఆఫ‌ర్‌

By:  Tupaki Desk   |   19 Feb 2022 8:30 AM GMT
ప‌వ‌న్ సినిమాకు ప్ర‌ముఖ ఓటీటీల‌ క్రేజీ ఆఫ‌ర్‌
X
స్టార్ హీరోల చిత్రాల‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల టాలీవుడ్ సినిమాల మార్కెట్ స్థాయి పెర‌గ‌డంతో ప్ర‌తీ సినిమా బిజినెస్ ప‌రంగా హాట్ కేక్ లా మారిపోతోంది. బిజినెస్ పరంగా, శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల ప‌రంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. స్టార్ సినిమా రిలీజ్ కు రెడీ అయిందంటే చాలు థియేట్రిక‌ల్ హ‌క్కుల ద‌గ్గ‌రి నుంటి డిజిట‌ల్ హ‌క్కుల వ‌ర‌కు భారీ పోటీ నెల‌కొంటోంది. ఎంత పోటీ వున్నా.. మేక‌ర్స్ ఎంత భారీగా కోట్ చేసినా ఓటీటీ దిగ్గ‌జాలు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

భారీగా పెట్టి సినిమాల్ని ద‌క్కించుకుంటూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా పెద్ద సినిమాల కోసం ఒక‌టి రెండు ఓటీటీ ద‌గ్గ‌జాలు క‌లిసి షేరింగ్ పంథాలో ద‌క్కించుకుంటున్నాయి. ఇదే త‌ర‌హాలో ఆహా ఓటీటీ , డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ క‌లిపి సొంతం చేసుకున్నాయ‌ట‌. ఇందు కోసం `భీమ్లా నాయ‌క్‌` మేక‌ర్స్ కి రికార్డు ప్రైజ్ ని ఆఫ‌ర్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీ కి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. అలాంటి సంస్థ తో క‌లిసి ఆహా `భీమ్లా నాయ‌క్‌` స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంద‌ని చెబుతున్నారు.

ఈ సినిమాతో `ఆహా`ని మ‌రింత మందికి రీచ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా `ఆహా` ఓటీటీని మ‌రింత పాపుర‌ల్ చేయాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల త‌మిళంలోనూ దీన్ని లాంఛ్ చేసి భారీ ఈవెంట్ ని నిర్వ‌హించారు. మిగ‌తా పాపుల‌ర్ ఓటీటీల త‌ర‌హాలో ఆహాని ప్ర‌తీ ఇంటికి చేరువ చేయాలంటే క్రేజీ స్టార్ సినిమా కావాల‌ని భావించిన ఆహా వ‌ర్గాలు ఇందు కోసం `భీమ్లా నాయ‌క్‌` ని ఎంచుకున్న‌ట్టుగా చెబుతున్నారు.

ఇప్ప‌టికే మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `క్రాక్‌`, నాగ‌చైత‌న్య న‌టించిన `ల‌వ్ స్టోరీ`, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రాల స్ట్రీమింగ్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు. `ఆహా` ఇప్ప‌టి వ‌ర‌కు స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ద‌క్కించుకున్న పెద్ద సినిమా `క్రాక్‌` మాత్ర‌మే. ఇప్ప‌డే `భీమ్లా నాయ‌క్‌`తో డేరింగ్ స్టెప్ వేయ‌బోతోంది. కార‌ణం ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. దీనిని అడ్డం పెట్టుకుని `ఆహా` ఓటీటీని వ‌ర‌ల్డ్ వైడ్ గా వున్న తెలుగు వాళ్లంద‌రికీ రీచ్ కావాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌.

ఆ కార‌ణంగానే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ తో క‌లిసి ఆహా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన క్రేజీ చిత్ర స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఓ వార్త వైర‌ల్ గా వినిపిస్తోంది. రిలీజ్ కు ముందు సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీ ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 25న ఐదు భాష‌ల్లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21న సోమ‌వారం అత్యంత భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నారు.