Begin typing your search above and press return to search.

తగ్గే ఛాన్స్ లేదంటున్న వెంకటేష్

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Nov 2023 5:32 AM GMT
తగ్గే ఛాన్స్ లేదంటున్న వెంకటేష్
X

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నారు. హిట్ సిరీస్ తర్వాత శైలేష్ కొలను నుంచి వస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే దృశ్యం 2 తర్వాత వెంకటేష్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై అండ్ లోనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాని సంక్రాంతికి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. టీజర్ రిలీజ్ సమయంలోనే ఆ రిలీజ్ డేట్ పక్కా అని చెప్పారు. అయితే సైంధవ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉందని, రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. కాని అలాంటిదేం లేదని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోన్న మాట.

సంక్రాంతిన అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం పక్కా అని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి రిలీజ్ పైనే ఆసక్తిగా ఉన్నారని వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని తెల్చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఐదు సినిమాల మధ్య పోటీ అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ గుంటూరు కారం మూవీ జనవర్ 12న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అలాగే ప్రశాంత్ వర్మ హనుమాన్ అదే రోజు రానుంది.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ జనవరి 13న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ మూవీ అదే రోజు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వెంకటేష్ సైంధవ్ కూడా జనవరి 13న రావడం కన్ఫర్మ్ అయిపొయింది. మొత్తం టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. వీటితో పాటుగా కోలీవుడ్ నుంచి మూడు డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలామ్, ధనుష్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ సినిమాలు పొంగల్ కానుకగా రానున్నాయి. ఇవి తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్స్ గా రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి వీటికి థియేటర్స్ ఎంత వరకు దొరుకుతాయనేది చూడాలి.