Begin typing your search above and press return to search.

విక్కీకి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమ‌ని వార్నింగ్?

ఇటీవలి ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాల‌ని బెదిరింపులు ఎదుర్కొన్న అనూహ్య‌ క్షణం గురించి ఒక అంద‌మైన స్టోరీని రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 6:48 AM GMT
విక్కీకి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమ‌ని వార్నింగ్?
X

బాలీవుడ్ పవర్ కపుల్ విక్కీ కౌశల్ -కత్రినా కైఫ్ (విక్ క్యాట్) జంట‌ ప్రేమ వివాహం అనంత‌ర లైఫ్ గోల్స్ గురించి తెలిసిన‌దే. ఈ జంట క‌పుల్ గోల్స్ తో నిరంత‌రం అభిమానులను ఆకర్షిస్తూనే ఉన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాల‌ని బెదిరింపులు ఎదుర్కొన్న అనూహ్య‌ క్షణం గురించి ఒక అంద‌మైన స్టోరీని రివీల్ చేసారు.

`జరా హాట్కే జరా బచ్కే` షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ విక్కీ అస‌లు విష‌యం చెప్పారు. ``నేను నా పెళ్లికి ముందు సినిమా షూటింగ్ సగంలో ఉన్నాను. ఆపై నా పెళ్లి కోసం బయలుదేరాను. పెళ్లయిన రెండు రోజులకే సెట్‌కి పిలిచారు. తో ఫిర్ ముఝే ధమ్కీ మిల్ గయీ థీ కి తుమ్హే దో దిన్ బాద్ సెట్ పే హి జానా హై తో షాదీ రెహ్నే హాయ్ దో (అప్పుడు నాకు బెదిరింపు కాల్ వచ్చింది. మీరు రెండు రోజుల్లో సెట్‌కి వెళ్లవలసి వస్తే పెళ్లి చేసుకోవద్దని దాని సారాంశం). అప్పుడు నేను `నో` చెప్పి ఐదు రోజుల తర్వాత సినిమా సెట్స్‌కి వెళ్లాను.. అని తెలిపాడు.

ఇది ఎంతో ఛ‌మ‌త్కారంగా అనిపించినా కానీ, విక్ క్యాట్ వైవాహిక జీవితంలోని కిక్ గురించి ఆనందం వ్యక్తం చేశాడు. వివాహం చాలా అందంగా ఉంది.. మీ ఇంటికి తిరిగి వచ్చినట్లు మీకు నిజంగా అనిపించే మీ సహచరి లేదా స‌హ‌చ‌రుడిని కనుగొనడం నిజంగా ఒక ఆశీర్వాదం. ఇది సుకూన్ (శాంతి) వాలా అనుభూతి. ఇది ఒక గొప్ప అనుభ‌వం. ఆమె (కత్రిన‌) మనోహరమైన మ‌నిషి. ఆమెతో జీవితాన్ని గడపడం అన్వేషించడం సరదాగా ఉంటుంది. నేను త‌న‌తో చాలా ప్రయాణిస్తున్నాను. ఇంతకు ముందు నేను పెద్దగా ఇలాంటి ఆనందాల‌ను అనుభవించలేదు`` అని అన్నాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విక్కీ కౌశల్ చివరిసారిగా YRF `ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ`లో మానుషి చిల్లర్‌తో కలిసి కనిపించాడు. మరోవైపు కత్రినా కైఫ్ ఇటీవల సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 లో కనిపించింది. ఈ తార‌లిద్దరూ ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. కొన్నివ‌రుస‌ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్నారు. కత్రినా తదుపరి విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కనిపించనుంది. కాగా విక్కీకి మేఘనా గుల్జార్ తెర‌కెక్కించిన‌ సామ్ బహదూర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.