విక్కీ-క్యాట్ కోసం ఓ స్టోరీ కావాలి!
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ దంపతుల ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Sept 2023 4:30 PMవిక్కీ కౌశల్-కత్రినా కైఫ్ దంపతుల ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సినిమా-ఫ్యామిలీ లైఫ్ ని పక్కాగా ప్లాన్ చేసుకుని బ్యాలెన్స్ గా ముందుకెళ్తున్నారు. ఖాళీ సమయం దొరికితే ఎంచక్కా రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఓ పది రోజులు వెకేషన్ మోడ్ ని ఆస్వాదించి తిరిగొచ్చి మళ్లీ షూటింగ్ ల్లో బిజీ అవుతున్నారు. కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకునే పనిలేదు.
అవకాశాలకు ఏమాత్రం కొదవలేదు. ఈ నేపథ్యంలో దంపతులిద్దరు తెరపై కొత్తగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భార్యామణితో కలిసి నటించడానికి విక్కీ రెడీగా ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఉత్సాహం చూసి కత్రినా అందుకు నేను సిద్దంగా ఉండనా? అని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. దీంతో ఇద్దరు ఒకే ప్రేమ్ లో కనిపించడానికి సంసిద్దంగా ఉన్నట్లు అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.
అయితే ఇక్కడ టాస్క్ ఏంటంటే? స్టోరీనే. జంటగా నటించబోయే సినిమా చాలా స్పెషల్ గా ఉండాలం టున్నాడు విక్కీ. అది ఇద్దరి జీవితాల్లో చిర స్థాయిగా నిలిచిపోయావాలని..ఆ స్టోరీ చాలా ఆర్గానిక్ గా ఉండాలంటున్నాడు. తమ ఇద్దర్ని అభిమానించే అభిమానులు కూడా అలాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. `అందుకు సమయం పట్టొచ్చు. కథ కుదరడం అన్నది అంత ఈజీ కాదు. ఇద్దరు నటుల్ని కథతో మెప్పించాలి.
అది ఎంతో సహజంగా ఉండాలి. సినిమా చూస్తున్నంతసేపు నిజ జీవితం తెరమీద కనిపిస్తున్నట్లు ఉండాలి. ఇలాంటి కథలు చాలా అరుదుగా పుడతాయి. అప్పటివరకూ మేము వెయిట్ చేస్తాం. కలిసి జీవించడమే కాదు..కలిసి సినిమా చేయాలన్నా అది చాలా స్పెషల్ గా ఉండాలి` అని అన్నారు. మరి ఈ దంపతుల్ని మెప్పించే కథ ఏ దర్శకుడు సిద్దం చేస్తాడో చూడాలి. దేశ భక్తి నేపథ్యం గల సినిమాలు చేయడంలో విక్కీ కౌశల్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన ఎక్కువగా ఆ తరహా కథల్నే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కత్రినాతో ప్రయాణం అనంతరం ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.