మరో హిస్టారికల్ ఫిల్మ్ లో విక్కీ కౌశల్
మహావతార్ సినిమాను విక్కీ కౌశల్ హీరోగా దినేష్ విజన్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోందని అతను తెలిపాడు.
By: Tupaki Desk | 4 May 2025 12:15 AM ISTప్రొడ్యూసర్ దినేష్ విజన్ వేవ్స్2025లో పాల్గొని ఇండియన్ కల్చర్ లో పాతకుపోయిన కథల గురించి చెప్పాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడారు. దాంతో పాటూ విక్కీ కౌశల్ చేయనున్న మహావతార్ సినిమా గురించి కూడా ఆయన మాట్లాడారు. అతను ఇప్పటివరకు నిర్మించిన సినిమాల్లో ఇదే అతి పెద్ద వెంచర్ అని దినేష్ విజన్ తెలిపారు.
మహావతార్ సినిమాను విక్కీ కౌశల్ హీరోగా దినేష్ విజన్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోందని అతను తెలిపాడు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ చిరంజీవి పరశురాముడిగా నటిస్తున్నాడు. విక్కీ ఫిల్మోగ్రఫీని బాగా పరిశీలిస్తే, ఇందులోని పాత్ర కూడా యాక్టర్ నటనను డామినేట్ చేస్తుందని అర్థమవుతోంది.
విక్కీ ఎంత ఫేమ్ సాధించినా అది ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత వల్లేనని, ఆయన సెలెక్ట్ చేసుకున్న పవర్‌ఫుల్ పాత్రల వల్లేనని, సామ్ బహదూర్ లో సామ్ మానేక్షా లేదా ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ క్యారెక్టర్లు ఆల్రెడీ చరిత్రలో అందరికీ తెలిసిన వారు కావడంతో ఆడియన్స్ ఆ పాత్రలో ఎవరు కనిపించినా బాగానే రిసీవ్ చేసుకుంటారు.
అలాంటి కథలను సెలెక్ట్ చేసుకోవడం వల్ల విక్కీ కౌశల్ యాక్టర్ గా ఆ పాత్రను పండించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. విక్కీ కౌశల్ కు బాక్సాఫీస్ వద్ద తట్టుకుని నిలబడేంత స్టామినా లేదు. అతని సక్సెస్ లలో ఎక్కువ భాగం ఛావా, ఉరి, సామ్ బహదూర్ లాంటి సినిమాలను ఎంచుకోవడం వల్లే దక్కాయి.
ఇప్పుడు మహావతార్ సినిమా కూడా అలానే తెరకెక్కుతుందని నిర్మాత మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఈ సినిమా హిట్ అయినా విక్కీ కౌశల్ పర్సనల్ స్టార్‌డమ్ వల్లే అయ్యే ఛాన్స్ లేదు. మహావతార్ పాత్రలోని వెయిట్ వల్లే ఈ సినిమా కూడా హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. మిగిలిన స్టార్ హీరోల్లాగా విక్కీ కౌశల్ కు మాస్ అప్పీల్ లేదనేది వాస్తవం. విక్కీ ఫేమ్ అతను సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ పై ఆధారపడి ఉంటుంది. మహావతార్ భారీ హిట్ గా నిలిచినా, అది విక్కీ యాక్టింగ్ వల్ల కాదని, కథ వల్లే అవుతుంది కాబట్టి విక్కీ ఇదే కంటిన్యూ చేస్తే అతను కేవలం నైపుణ్యం కలిగిన పెర్ఫార్మర్ గా మారే ఛాన్సుంది.
